Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌కు సైజ్ పెంచుకోమ‌న్నారు!

By:  Tupaki Desk   |   1 March 2022 12:30 AM GMT
ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌కు సైజ్ పెంచుకోమ‌న్నారు!
X
రంగుల మాయా ప్రపంచంలో చిత్ర‌విచిత్రాలెన్నో. ఇక్క‌డ కెరీర్ ప‌రంగా ఎగుడు దిగుడు ప్ర‌యాణం త‌ప్ప‌నిస‌రి. ముఖ్యంగా న‌వ‌త‌రం నటీమ‌ణులు కెరీర్ ఆరంభం లొంగి ఉండాలి.

కుద‌ర‌దంటే అవ‌కాశాలు రావ‌డం క‌ష్టం. ఒక‌సారి నేము ఫేము వ‌చ్చే వ‌ర‌కూ ఎవ‌రు ఏం చెప్పినా చేయాలి అన్న‌ట్టే ఉంటుంది ఎగ్జిస్టెడ్ సిస్ట‌మ్. ఈ సిస్ట‌మ్ లో త‌ల వొంచితే ఒక‌లా.. వంచ‌క‌పోతే ఇంకోలా ట్రీట్ త‌ప్ప‌దు. అన్నిటినీ అనుభ‌వించాకే స్టార్ హీరోయిన్ గా ప్ర‌మోష‌న్ వ‌స్తుంద‌ని కొంద‌రు అనుభ‌వ‌జ్ఞులైన నాయిక‌లే చెప్పారు.

అదంతా స‌రే కానీ .. గ్లామ‌ర్ ప్ర‌పంచంలో త‌మ అంద‌చందాల‌ను ఎంతో అద్భుతంగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేయాలంటే వాస్త‌వంగా ఉన్న అందాలు చాల‌వు. వాటికి మెరుగుల‌ద్ద‌డం ఇక్క‌డ చాలా స‌హ‌జం. కొంద‌రు ముక్కును స‌రి చేయించుకుంటారు. మ‌రికొంద‌రు పెద‌వులు.. కొంద‌రు చిన్ భాగం.. ఇలా ర‌క‌ర‌కాల మార్పు చేర్పులు చేయించేవాళ్లుంటారు. శ్రీ‌దేవి.. ప్రియాంక చోప్రా..గౌత‌మి.. శ్రుతిహాస‌న్.. స‌హా చాలా మంది క‌థానాయిక‌లు ఇలా క‌త్తి గాటును చ‌వి చూసిన వాళ్లే.

అయితే వీళ్లంద‌రిలో ప్రియాంక చోప్రా.. దీపిక ప‌దుకొనేకు ఎదురైన అనుభ‌వాలు చాలా క‌ఠోరంగా ఉన్నాయి. ఇంత‌కుముందు ప్రియాంక చోప్రా త‌న ఆత్మ‌క‌థ సంక‌ల‌నంలో త‌న పిరుదుల్ని స‌రి చేయించుకోవాల‌ని వ‌క్షోజాల సైజ్ పెంచుకోవాల‌ని కొందరు సూచించిన‌ట్టు వెల్ల‌డించారు.

ఇంచుమించు అలాంటి స‌ల‌హానే దీపిక ప‌దుకొనేకు కూడా ఇచ్చాడుట ఎవ‌రో ఒక‌త‌ను. త‌న‌కు 18ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు త‌న వ‌క్షోజాల సైజ్ పెంచుకోవాల‌ని అత‌డు సూచించాడ‌ట‌. కానీ తాను అప్ప‌టికి దానిని ప‌ట్టించుకునే స్థితిలో లేన‌ని దీపిక చెప్పింది. ఇక‌పోతే ఈ త‌ర‌హా వేధింపులు కేవ‌లం ఆ ఇద్ద‌రికే కాదు.. చాలా మంది క‌థానాయిక‌లు ఎదుర్కొన్న‌వాళ్లే.

అయితే అంద‌రూ బ‌య‌ట‌ప‌డ‌రు. కొంద‌రు మాత్ర‌మే ఇలా బ‌హిరంగంగా ప్ర‌తిదీ చెప్పేస్తున్నారు. త‌న ముక్కుకు క‌త్తెర వేసార‌ని ఇంత‌కుముందు శ్రుతిహాస‌న్ బ‌హిరంగంగా అంగీక‌రించింది. అయితే దానికి కూడా ఎవ‌రో ఒక‌రి స‌జెష‌న్ తాను తీసుకునే ఉంటుంది.