Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: హంస‌రాణుల హొయ‌లు

By:  Tupaki Desk   |   18 Dec 2018 1:30 AM GMT
ఫోటో స్టోరి: హంస‌రాణుల హొయ‌లు
X
అవార్డుల వేడుక‌లు అంటే హంస రాణులు హంస న‌డ‌క‌ల‌ తో హొయ‌లొలికించే తీరుకు కుర్ర‌కారు మ‌తి చెడాల్సిందే. నేడు అలాంటి ఓ లైవ్ షో యూత్‌ కి కిక్కెక్కించింది. ప్ర‌తిష్ఠాత్మ‌క స్టార్ స్క్రీన్ అవార్డ్స్ 2018 వేడుక‌లో హంస‌రాణుల త‌ళాంగు త‌ళుకులు ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కొచ్చాయి. బాలీవుడ్ అందాల భామ‌లు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ వేడుక‌ను హుషారెత్తించారు.

ఈ వేడుక‌ లో అందాల క‌త్రిన కైఫ్‌- మౌని రాయ్- ఆలియా భ‌ట్ స్పెష‌ల్ అప్పియ‌రెన్స్‌ తో అద‌ర‌గొట్టేశారు. వీళ్ల‌తో పాటే సాహో బ్యూటీ శ్రద్ధా క‌పూర్ త‌ళుక్కుమ‌ని మెరిసింది. అలాగే కొత్త జంట ర‌ణ‌వీర్ సింగ్- దీపిక ప‌దుకొనే స్పెష‌ల్ గెట‌ప్పుల‌తో దిగి అహూతుల్ని అల‌రించారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో లు యూత్ సామాజిక మాధ్య‌మాల్లో జోరు గా వైర‌ల్ అవుతున్నాయి.

స‌ల్మాన్ భాయ్- అక్ష‌య్ కుమార్- రాజ్ కుమార్ రావ్- ఆయుష్మాన్ వంటి స్టార్లు ఈ అవార్డుల వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. స్త్రీ- బ‌దాయి హో- అందాధున్- రాజీ వంటి చిత్రాల‌ కు ఈ అవార్డుల్లో పుర‌స్కారాల పంట పండింది. ఆలియా ఉత్త‌మ క‌థానాయిక‌(రాజీ)గా- రాజ్ కుమార్ రావ్ ఉత్త‌మ క‌థానాయ‌కుడి(స్త్రీ సినిమాకి) గా అవార్డులు అందుకున్నారు. అందాల నాయిక‌ల రెడ్ కార్పెట్ న‌డ‌క‌లు ఈ వేడుక‌ల్లో ఆక‌ట్టుకున్నాయి.