Begin typing your search above and press return to search.

ఒక్క‌సారిగా హీట్ పెంచిన అర్జున్ రెడ్డి బ్యూటీ

By:  Tupaki Desk   |   19 Feb 2022 5:11 PM GMT
ఒక్క‌సారిగా హీట్ పెంచిన అర్జున్ రెడ్డి బ్యూటీ
X
ఆరుప‌ల‌క‌లు మెలి తిప్పింది.. టోన్డ్ బాడీతో షాకిచ్చింది..! ఇంత‌కీ ఎవ‌రీ బ్యూటీ? అంటే.. ఇంకెవ‌రు.. అర్జున్ రెడ్డి ఫేం షాలినీ పాండే. ఇటీవ‌ల కొంత కాలంగా బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీ అయిపోయిన షాలిని అస‌లు తెలుగు జ‌నాల్ని ప‌ట్టించుకోవ‌డం మానేసింది. ఇక్క‌డ అస్స‌లు సినిమాలు చేస్తున్న వైనం క‌నిపించ‌లేదు.  ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్స్ లో పెద్ద‌గా చ‌డీ చ‌ప్పుడు లేదు. మ‌హా న‌టి త‌ర్వాత షాలిని వేరొక పెద్ద క్రేజ్ ఉన్న సినిమాతో రాలేదు.

ఇది నిజంగా నిరాశ‌ను క‌లిగించే విష‌య‌మే త‌న అభిమానుల‌కు. పెర్ఫామ‌ర్ గా ఆరంగేట్ర చిత్రంతోనే నిరూపించిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత ఎడా పెడా సంత‌కాలు చేయ‌లేదు. పారితోషికాల కోసం సినిమాలు చేయ‌డం లేదు. చాలా ఛూజీగా సెల‌క్టివ్ గా మాత్ర‌మే ఉంటోంది. ఇక సోష‌ల్ మీడియాల్లో ఫోటోషూట్లు వీడియో షూట్ల‌తో అంత‌కంత‌కు హీట్ పెంచేయ‌డంలో షాలిని ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. దీనికి తోడు తాజాగా త‌న మేకోవ‌ర్ కి సంబంధించిన ఫోటోషూట్ తో మంట‌లు పెట్టింది.

6 ప్యాక్ లుక్కు టోన్డ్ బాడీతో స్ట‌న్న‌ర్ గా క‌నిపించింది షాలిని. ఇంత‌లోనే అంత‌టి మేకోవ‌ర్ సాధ్య‌మా? అని ప్ర‌శ్నిస్తే దీనికోసం ఏడాదిన్న‌ర‌గా క‌ఠోరంగానే శ్ర‌మించింది ఈ బ్యూటీ. లాక్ డౌన్ ని ఉప‌యోగించుకుని ఫిజిక‌ల్ గా చాలా మేక‌వ‌ర్ చూపిస్తోంది. నిజానికి షాలిని యావ‌రేజ్ బ్యూటీ. కానీ గొప్ప పెర్ఫామ‌ర్.. దీంతో అవ‌కాశాలు త‌న‌కు కొద‌వేమీ లేదు. ఇక దానికి ఇప్పుడు స‌రికొత్త మేకోవ‌ర్ ని యాడ‌ప్ చేసి మ‌తులు చెద‌ర‌గొడుతోంది.

షాలినీ పాండే ఇట‌వ‌ల‌ బాలీవుడ్ లో బిజీ నాయిక‌గా మారుతోంది. టాలీవుడ్ లో అడ‌పాద‌డ‌పా న‌టించినా ఇప్పుడు పూర్తిగా ఉత్త‌రాది సినిమాల‌పైనే దృష్టి నిలిపింది. దీంతో కెరీర్ ఆరంభంలోనే షాలినికి ర‌ణ‌వీర్ సింగ్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ ద‌క్కింది. ప్ర‌స్తుతం ర‌ణ‌వీర్ స‌ర‌స‌న `జయేశ్ భాయ్  జోర్డార్`  చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తోంది.  దివ్యాంగ్ ట‌క్క‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. య‌శ్ రాజ్ ఫిలింస్ ఈ మూవీని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. చిత్రీక‌ర‌ణ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది.

ర‌ణ‌వీర్ సింగ్ తో షాలినికి తొలి చిత్ర‌మిది. రిలీజ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను అని తెలిపింది. అదీ దేశ వ్యాప్తంగా అన్ని థియేట‌ర్లల‌లో రిలీజ్ అయితే న‌న్ను నేను తెర‌పై చూసుకోవాల‌ని ఎంతో ఆశ‌ప‌డుతున్నారు. నా త‌ల్లింద‌డ్రులు ఎంతో ఆశ‌గా ఉన్నారు.

ఏడాదిన్న‌ర  కాలంగా  మేమంతా ఎంతో  వెయిట్ చేస్తున్నాం. హిందీ లో న‌టిస్తున్న తొలి పెద్ద సినిమా ఇదే కావ‌డంతోనే ఇంత ఉత్సాహంగా ఉన్నాను. నా ఎమోషన్స్ అదుపు త‌ప్పుతున్నాయి. రిలీజ్ అయ్యేవ‌ర‌కూ ఆగ‌లేక‌పోతున్నాను.. అని తెలిపింది.  వీలైనంత త్వ‌ర‌గా థియేట‌ర్లో రిలీజ్ అవుతుంద‌ని భావిస్తున్నాన‌ని ఆశాభావం వ్య‌క్తం చేసింది. యశ్ రాజ్ బ్యాన‌ర్లో సినిమా చేయ‌డం ఇప్ప‌టికీ క‌లో నిజ‌మో అర్ధం కావ‌డం లేదు. ఇలా అనుకునే లోపే మ‌రో రెండు సినిమా ఛాన్సులు  అదే బ్యాన‌ర్ లో వ‌చ్చాయి. య‌శ్ రాజ్ బ్యాన‌ర్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు అదే బ్యాన‌ర్లో ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నాను.  ఈ బ్యాన‌ర్ ఫేవ‌రేట్ హీరోయిన్ గా మారిపోవాల‌ని ఉంద‌ని షాలిని పాండే తెలిపింది.