Begin typing your search above and press return to search.

మాస్క్ త‌ల‌పాగ‌తో ఎందుకీ క‌వ‌రింగ్ తేజ్?

By:  Tupaki Desk   |   22 Feb 2022 4:30 AM GMT
మాస్క్ త‌ల‌పాగ‌తో ఎందుకీ క‌వ‌రింగ్ తేజ్?
X
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దొంగాట ఆడుతున్నాడు. అస్స‌లు ఫ్యాన్స్ కి ఎలాంటి క్లూ ఇవ్వ‌కుండా జాగ్ర‌త్తప‌డుతున్నాడ‌ని తాజాగా లీకైన ఫోటోలు చెబుతున్నాయి. మాస్క్ వేసాడు.. పైగా త‌ల‌పాగా చుట్టాడు. పూర్తిగా గెట‌ప్ ఛేంజ్ చేసి ప‌బ్లిక్ లో క‌నిపించాడు. ప‌ర్టిక్యుల‌ర్ గా చూస్తే కానీ తేజ్ అని గుర్తు ప‌ట్ట‌లేరు.

ఏదేమైనా అతడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? అభిమానుల నుంచి ఇంకా ఏం దాచాల‌నుకుంటున్నాడు? ఏదైనా ఓపెన్ గా ఉంటే బావుండేది క‌దా? అంటూ ఫ్యాన్స్ క‌ల‌త‌కు గుర‌వుతున్నారు.

గతేడాది టెర్రిబుల్ బైక్ యాక్సిడెంట్ తర్వాత తొలిసారిగా ఇలా సాయి తేజ్ పబ్లిక్ గా కనిపించాడు. సోమవారం సాయితేజ్ ఇంద్రకీలాద్రిని సందర్శించి కుటుంబ సమేతంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు సాయి తేజ్ కి స్వాగతం పలికి ఆయన దివ్య ప్రసాదాలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

పూజల అనంతరం అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించి ఆలయ అర్చకుల ఆశీస్సులు తీసుకున్నారు సాయితేజ్. ఇంద్రకీలాద్రి సందర్శనను ముగించుకుని తాను విజయవాడలో ఉన్నప్పుడల్లా ఆలయానికి వ‌స్తాన‌ని.. ఈ యాత్ర కొత్త‌దేమీ కాదని కూడా సాయి తేజ్ చెప్పాడు. చాలా సాధా సీదాగా ఎలాంటి హ‌డావుడి లేకుండా సాయి తేజ్ దైవ‌ద‌ర్శ‌నం చేసుకున్నారు.

అయితే సాయి తేజ్ ఇలా మాస్క్ త‌ల‌పాగాతో క‌వ‌ర‌ప్ చేయ‌డానికి కార‌ణం కూడా ఉంది. అత‌డు తదుప‌రి చిత్రంలో న‌టించేందుకు సన్నాహ‌కాల్లో ఉన్నాడు. ఇంత‌కుముందు అతడి కొత్త లుక్ కి సంబంధించిన ఫోటోల్ని రివీల్ చేశాడు. ఇప్పుడు కూడా గెట‌ప్ ఛేంజ్ ఏదైనా దాచాల‌నుకుంటున్నాడా? అన్న‌ది అర్థం కాలేదు. అత‌డి హెయిర్ ఇప్పుడు కొత్త‌గా ఉంది. మేకోవ‌ర్ ట్రెండీగా క‌నిపిస్తోంది. కానీ దానిని దాచేసాడిలా.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... సాయి తేజ్ తన 15వ చిత్రానికి స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. కార్తీక్ వర్మ దండు దీనికి ద‌ర్శ‌కుడు. తమిళ చిత్రం `వినోదయ సితం` రీమేక్ లో తన మామ పవన్ కళ్యాణ్ తో క‌లిసి న‌టిస్తార‌ని ఇటీవ‌ల గుస‌గుస‌లు వినిపించాయి. కానీ దానిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. రిప‌బ్లిక్ త‌ర్వాత సాయి తేజ్ ఇప్పుడు తిరిగి పూర్తిగా కెరీర్ పై దృష్టి సారించాడు. బ్రేక్ త‌ర్వాత రీలాంచ్ ముందు ఇలా దుర్గామాత పూజ‌లాచ‌రించార‌న్న‌మాట‌.