Begin typing your search above and press return to search.

రాక్ స్టార్ తో ర‌ష్మిక మంద‌న్న రొమాన్స్!

By:  Tupaki Desk   |   30 March 2022 1:30 AM GMT
రాక్ స్టార్ తో ర‌ష్మిక మంద‌న్న రొమాన్స్!
X
నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ని టార్గెట్ చేసి సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. `పుష్ప` స‌క్సెస్ తో బ్యూటీ పాన్ ఇండియా హీరోయిన్ గా ఫేమ‌స్ అయింది. ఆ సినిమా విజ‌యంతో బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా వెలిగిపోతుంది. హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్థిర‌ప‌డాల‌నుకున్న ర‌ష్మిక ఆలోచ‌న‌కు `పుష్ప` స‌క్సెస్ పెద్ద పీఠ వేసింది.

ప్ర‌స్తుతం అక్క‌డ వికాస్ భాయ్ ద‌ర్శ‌క‌త్వంలో అమితాబాచ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతోన్న‌` గుడ్ బై` చిత్రంలో న‌టిస్తోంది. ఇందులో నీతి ప్ర‌జాప‌తి పాత్ర‌లో న‌టిస్తోంది. అలా ఆరంభంలోనే బిగ్ స్టార్ తో తెర‌ను పంచుకునే అరుదైన అవ‌కాశం రష్మిక‌కి ద‌క్కింది. ఇటీవ‌లే ఆ సినిమా చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌యింది. త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది.

మ‌రో వైపు శాంత‌ను బాగ్చీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న స్పై థ‌రిల్ల‌ర్ `మిష‌న్ మజ్ను` లో న‌టిస్తోంది. ఇందులో సిద్దార్ధ్ మ‌ల్హోత్రాకి జంట‌గా న‌టిస్తోంది. ఈ సినిమా కూడా చిత్రీక‌ర‌ణ ముగించుకుంది. త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. ఇలా రెండు బాలీవుడ్ సినిమాలు రిలీజ్ కాకుండానే రష్మిక తాజాగా మ‌రో ఛాన్స్ అందుకున్న‌ట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ మేక‌ర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో `యానిమ‌ల్` చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రాక్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ర‌ష్మిక ఎంపికైన‌ట్లు చిల‌వ‌లు ఫ‌ల‌వులుగా మీడియాలో వార్త లొస్తున్నాయి. తాజాగా అది నిజ‌మేన‌ని తెలుస్తోంది. ఆ పాత్ర‌కు ర‌ష్మిక అయితే ప‌ర్పెక్ట్ గా సూట‌వుతుంద‌ని భావించి సందీప్ రెడ్డి లాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ లో ఫేమ‌స్ అయిన కొంత మంది హీరోయిన్లపై టెస్ట్ షూట్ నిర్వ‌హించిన‌ప్ప‌టికీ ర‌ష్మిక అంత ప‌ర్పెక్ష‌న్ మిగ‌తా వారిలో దొర‌క‌లేదుట‌. ఈ నేప‌థ్యంలో ర‌ష్మిక‌నే ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో ర‌ష్మిక ర‌ణ‌బీర్ క‌పూర్ భార్య పాత్ర‌లో న‌టించనుంది. ఇద్ద‌రి మ‌ధ్య ఇంటిమేట్ స‌న్నివేశాలు ఫ‌రిది దాటే ఉంటాయ‌ని స‌మాచారం. ఇద్దరి కెమిస్ర్టీ కూడా బాగుంటుంద‌ని ర‌ష్మ‌క‌ని తుదిగా నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. యానిమ‌ల్ లో ర‌ష్మిక పాత్ర‌కి చాలా ప్రాముఖ్య‌త ఉంటుంది.

హిందీ పరిశ్ర‌మ‌లో స్థిర‌ప‌డాల‌నుకుంటోన్న ర‌ష్మ‌క‌కి ఇది మంచి అవ‌కాశం. రాక్ స్టార్ తో రొమాన్స్ చేసిన కొంత మంది భామ‌లు బాలీవుడ్ నే ఏల్తున్నారు. ఆ కోవ‌లో ర‌ష్మిక కెరీర్ కూడా ముందుకు సాగిపోవాల‌ని ఆశిద్దాం. ప్ర‌స్తుతం ర‌ష్మిక `పుష్ప‌` రెండ‌వ భాగంలో న‌టిస్తోంది. బాలీవుడ్ ఆఫ‌ర్ల నేప‌థ్యంలో తెలుగులో కొత్త సినిమాల‌కు సైన్ చేయ‌డం లేద‌ని స‌మాచారం.