Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్‌ తో త్రివిక్రమ్‌.. కాస్త కన్ఫ్యూజన్‌ గా ఉన్నా ఇంట్రెస్టింగ్‌

By:  Tupaki Desk   |   22 March 2022 1:30 PM GMT
రౌడీ స్టార్‌ తో త్రివిక్రమ్‌.. కాస్త కన్ఫ్యూజన్‌ గా ఉన్నా ఇంట్రెస్టింగ్‌
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన లైగర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ను ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమా కోసం విజయ్ దేవరకొండ గత రెండు సంవత్సరాలుగా పొడవాటి జుట్టుతో కనిపిస్తూ వచ్చాడు.

ఆ సినిమా షూటింగ్ పూర్తి అవడం వల్ల ఇటీవల తన నార్మల్ లుక్‌ హెయిర్‌ స్టైల్ కి రావడం జరిగింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ తదుపరి సినిమా ఏంటి అనే చర్చ పతాక స్థాయిలో జరుగుతోంది. ఈయన శివ నిర్వాణ దర్శకత్వం లో ఒక సినిమా చేయాల్సి ఉంది. అదే సమయం లో సుకుమార్ దర్శకత్వం లో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. కానీ ఈ రెండు సినిమా ల్లో ఏ సినిమా కూడా ఇప్పట్లో పట్టాలు ఎక్కే అవకాశాలు కనిపించడం లేదంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సుకుమార్ పుష్ప 2 సినిమా తో బిజీగా ఉన్నాడు. మరో వైపు శివ నిర్వాణ దర్శకత్వం లో సినిమా చేసేందుకు విజయ్ దేవరకొండ కాస్త టెన్షన్ పడుతున్నాడు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాని కొందరు మాత్రం ఆ సినిమా త్వరలో ప్రారంభం అవుతుందని.. సమంత ఆ సినిమా లో విజయ్‌ దేవరకొండ కి జోడీగా నటించబోతుంది అంటూ ప్రచారం కూడా జరుగుతోంది.. అది వేరే విషయం అనుకోండి.

ఇక అసలు విషయం ఏంటంటే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయబోతున్నాడట. ఈ కొత్త పుకారు సినీ ప్రేమికులకు ఆసక్తిని రేకెత్తిస్తోంది. వీరిద్దరి కాంబో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇద్దరు కూడా విభిన్నమైన ఇమేజ్ ఉన్న వారు. ఇలాంటి వీరిద్దరూ కలిసి సినిమా చేయడం అంటే ఖచ్చితంగా అదే బ్రహ్మపదార్థం అన్నట్లుగానే ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కచ్చితంగా సినిమాకు మంచి క్రేజ్ అయితే లభించే అవకాశం ఉంది. కనుక వీరిద్దరి సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు మరియు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మహేష్ బాబుతో ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా షురూ చేశాడు. మహేష్ బాబు షూటింగ్ లో అయితే జాయిన్ కాలేదు కానీ త్రివిక్రమ్ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడట. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ తో మహేష్ బాబు జాయిన్ అవుతాను అంటూ చెప్పుకొచ్చాడు.

కనుక త్రివిక్రమ్ తో మహేష్ బాబు చేస్తున్న సినిమా ఈ ఏడాది చివరి వరకు పట్టే అవకాశం ఉంది. అంటే రౌడీ స్టార్ తో త్రివిక్రమ్ సినిమా చేయాలంటే ఈ ఏడాది చివరి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి అప్పటి వరకు విజయ్ దేవరకొండ ఏం చేస్తాడు.. మరేదైనా సినిమా చేస్తాడా అనేది చూడాలి. మొత్తానికి ఈ టాపిక్ కాస్త కన్ఫ్యూజన్ ను క్రియేట్‌ చేస్తున్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనే టాక్‌ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో వినిపిస్తుంది.