Begin typing your search above and press return to search.

శ్రుతి హాస‌న్ పెళ్లి అయిపోయింది..లీకైన సీక్రెట్‌!

By:  Tupaki Desk   |   24 March 2022 5:37 AM GMT
శ్రుతి హాస‌న్ పెళ్లి అయిపోయింది..లీకైన సీక్రెట్‌!
X
ప్రకాష్ కోవెలమూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `అనగనగా ఓ ధీరుడు` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన స్టార్ కిడ్ శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ స్టార్ట్ చేసిన కొత్త‌లో వ‌రుస ఫ్లాపులు ఎదురైనా.. `గబ్బర్ సింగ్` మూవీతో తొలి హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆపై బలుపు, రేసుగుర్రం, శ్రీ‌మంతుడు చిత్రాల‌తో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న శ్రుతి హాస‌న్‌.. మ‌రోవైపు లండన్ కుర్రాడు మైఖేల్ కర్సెల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలింది.

కానీ, ఈ జంట పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే విడిపోయారు. ప్రియుడితో బ్రేక‌ప్ కార‌ణంగా డిప్రెష‌న్‌లోకి వెళ్లిన శ్రుతి హాస‌న్ కొన్నాళ్లు సినిమాల‌కు దూరంగా ఉన్నా.. 2020లో మ‌ళ్లీ `క్రాక్‌`తో మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఆ త‌ర్వాత `వ‌కీల్ సాబ్‌`తో మ‌రో హిట్ అందుకున్న ఈ భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోంది.

అలాగే డూడుల్‌ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న శాంతను హజారికతో ప్రేమాయ‌ణం న‌డిపిస్తోంది. ఈ విష‌యాన్ని శ్రుతి ఇప్ప‌టికే క‌న్ఫార్మ్ చేయ‌గా.. శాంతను తాజాగా మా పెళ్లి అయిపోయిందంటూ సీక్రెట్ లీక్ చేశాడు.

ఓ ఇంగ్లీష్‌ మీడియా ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న‌.. శృతి హాసన్‌తో త‌న రిలేషన్ గురించి ప్ర‌స్తావించాడు. ఈ నేప‌థ్యంలోనే `క్రియేటివ్‌గా మా పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. అందుకు నిదర్శనం మా బలమైన బంధం.

మేమిద్దరం క్రియేటివ్‌ పీపుల్‌. ఇద్దరం కలిసి కొత్త కొత్త విషయాలను క్రియేట్‌ చేయాలనుకుంటాం. మా క్రియేటివ్‌ థాట్స్ కూడా ఒకేలా ఉంటాయి. ఇక మా ప్రత్యక్ష వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ, ప‌రోక్షంగా మాత్రం అయిపోయింది` అంటూ శాంతాను చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడీయన చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

కాగా, శ్రుతి హాస‌న్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. గోపీచంద్ మ‌లినేని, నంద‌మూరి బాల‌కృష్ణ‌ కాంబోలో తెర‌కెక్కుతున్న `ఎన్‌బీకే 107`లో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే బాబీ రూపొందిస్తున్న `మెగా 154`లో చిరంజీవి స‌ర‌స‌న న‌టిస్తున్న శ్రుతి హాస‌న్‌.. ప్ర‌భాస్‌తో `స‌లార్‌` మూవీ చేస్తోంది. ఈ మూడు ప్రాజెక్ట్‌లు ప్ర‌స్తుతం సెట్స్ మీదే ఉన్నాయి.