Begin typing your search above and press return to search.

మాచ‌ర్ల‌లో నితిన్ మాస్ జాత‌ర షురూ

By:  Tupaki Desk   |   30 March 2022 6:05 AM GMT
మాచ‌ర్ల‌లో నితిన్ మాస్ జాత‌ర షురూ
X
హీరో నితిన్ త‌న పంథా మార్చుకున్నారు. కెరీర్ ప‌రంగా విభిన్న‌మైన చిత్రాలని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవ‌ల బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `అంధాదున్‌` ఆధారంగా తెర‌కెక్కిన `మాస్ట్రో` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం'.ఈ మూవీ ద్వాకా ఎడిట‌ర్ ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర‌రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రేష్ట్ మూవీస్‌, ఆదిత్య మూవీస్‌, ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్స్ పై ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కేథ‌రిన్‌, కృతిశెట్టి హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. నితిన్ కెరీర్ లోనే హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇటీవ‌లే ఫేమ‌స్ ఫైట్ మాస్ట‌ర్స్ అన‌ల్ - అర‌సు నేతృత్వంలో కీల‌క‌మైన యాక్ష‌న్ సీక్వెన్స్ ని పూర్తి చేశారు. ఈ చిత్రంలో హీరో నితిన్ గుంటూరు క‌లెక్ల‌ర్ సిద్దార్ధ‌రెడ్డిగా క‌నిపించ‌బోతున్నారు. గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా చాలా ప‌వ‌ర్ ఫుల్ గా నితిన్ పాత్ర‌ని ద‌ర్శ‌కుడు డిజైన్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

ఇటీవ‌ల నితిన్ ఫ‌స్ట్ లుక్ ని ఫ‌స్ట్ ఛార్జ్ అంటూ విభిన్నంగా విడుద‌ల చేసిన మేక‌ర్స్ ఈ బుధ‌వారం ఈ మూవీ టీజ‌ర్ ని ఫ‌స్ట్ ఎటాక్ అంటూ విడుద‌ల చేశారు. క‌త్తుల‌తో దాడికి దిగిన పులి వేష‌గాళ్ల‌తో నితిన్ ఫైట్ చేస్తున్న హై వోల్టేజ్ యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని చూపిస్తూ ఫ‌స్ట్ ఎటాక్ ని విడుద‌ల చేశారు. ఇందులో నితిన్ క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. లుక్ ప‌రంగానూ గ‌త చిత్రాల‌కు నితిన్ పూర్తి భిన్నంగా క‌నిపిస్తున్నారు.

ఫ‌స్ట్ ఎలాక్ అంటూ రిలీజ్ చేసిన టీజ‌ర్ పేరుకు త‌గ్గ‌ట్టే సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. నితిన్ భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీని హోమ్ బ్యాన‌ర్ లో నితిన్ ఫాద‌ర్ ఎన్ . సుధాక‌ర్ రెడ్డి, సిస్ట‌ర్ నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా మేక‌ర్స్ బుధ‌వారం టీజ‌ర్ తో స‌హా ప్ర‌క‌టించేశారు. ఈ మూవీని జూలై 8న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. టీజ‌ర్ లో చూపించిన యాక్ష‌న్ సీక్వెన్స్ ని ఫైట్ మాస్ట‌ర్ వెంక‌ట్ కంపోజ్ చేశారు.

అత్యంత ప‌వ‌ర్ ఫుల్ గా చిత్రీక‌రించిన ఈ ఫైట్ సినిమాకు ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని తెలుస్తోంది. ప్ర‌ముఖ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీ ప్ర‌సాద్ మూరెళ్ల‌, ఎడిటింగ్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఫైట్స్ : అన‌ల్ - అర‌సు, వెంక‌ట్‌, డైలాగ్స్ తిరుప‌తి మామిడాల‌. ఆర్ట్ సాహి సురేష్.