Begin typing your search above and press return to search.

అంత హడావుడి చేసిన బేబమ్మ టాప్‌ జాబితాలో కష్టమేనా?

By:  Tupaki Desk   |   12 April 2022 5:30 AM GMT
అంత హడావుడి చేసిన బేబమ్మ టాప్‌ జాబితాలో కష్టమేనా?
X
ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ కృతిశెట్టి. మొదటి సినిమా విడుదల కాకుండానే ఆ సినిమా లోని ముద్దుగుమ్మ అప్పియరెన్స్ తో అనూహ్యంగా వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. ఉప్పెన సినిమా విడుదలకు ముందే రెండు మూడు ఆఫర్లకు సైన్ చేసిన కృతి శెట్టి అనూహ్యంగా ఉప్పెన సినిమా వంద కోట్ల సినిమా గా నిలవడంతో మరింతగా ఆఫర్లు దక్కించుకుంది.

ఉప్పెన సినిమాకు ముందు తర్వాత దాదాపుగా అరడజను సినిమాలకు సైన్ చేసింది. అందులో ఇప్పటికే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి బంగార్రాజు కాగా మరోటి నాని తో కలిసి నటించిన శ్యామ్‌ సింగ రాయ్. మొత్తానికి బేబమ్మ మూడు సినిమాలకు మూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. నాల్గవ సినిమా గా సుధీర్‌ బాబు తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

హీరోయిన్ గా స్టార్‌ డమ్‌ దక్కాలంటే.. స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో చేరాలంటే కాస్త ఓపిక.. కాస్త తెలివి ఉండాలి అనే విషయం ను బేబమ్మ కృతి శెట్టి మర్చి పోయినట్లుగా ఉంది. ఆమె సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల అనూహ్యంగా ప్లాప్‌ స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో ప్లేస్ దక్కే అవకాశం కోల్పోయింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఒకరు ఇద్దరు చిన్న హీరోలతో ఈమె సినిమాలు నటించడం వల్ల స్టార్‌ డం తగ్గిందనే కామెంట్స్ వస్తున్నాయి.

ఇంకా ఆ సినిమా విడుదల కాకుండానే ఆ హీరోతో ఈమె నటించడం వల్ల చిన్న హీరోయిన్ స్థాయిని పడి పోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. అందుకే స్టార్‌ హీరోలకు జోడీగా ఈ అమ్మడికి నటించే అవకాశాలు రావడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన కొత్త చర్చలు జరుగుతున్నాయి కాని స్టార్ హీరోలకు జోడీగా మాత్రం ఆఫర్లు రావడం లేదు.

ఉప్పెన సినిమా సూపర్‌ హిట్‌ అయిన సమయంలోనే కాస్త ఓపికతో వెయిట్‌ చేసి ఉంటే పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చేవి అనేది కొందరి అభిప్రాయం. స్టార్ హీరోలకు జోడీగా నటించకుండా ఖచ్చితంగా స్టార్‌ హీరోయిన్‌ అవ్వడం కష్టం. వరుసగా చిన్న హీరోలతో... టైర్ 2 హీరోలతో నటించడం వల్ల ప్రయోజనం తక్కువే. అందుకే బేబమ్మ టాప్‌ హీరోయిన్స్‌ ల జాబితాలో చేరేందుకు సమయం పట్టే అవకాశం ఉంది.

కృతి శెట్టి త్వరలోనే సుధీర్‌ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే కాకుండా రామ్‌ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో కూడా హీరోయిన్ గా ఈమె నటించిన విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మరో రెండు మూడు సినిమాలు కూడా షూటింగ్‌ దశలో ఉన్నాయి.. మరి కొన్ని సినిమా లు చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

రాబోయే కాలంలో అయినా ఈ అమ్మడు కాస్త సినిమాలను తెలివిగా ఎంపిక చేసుకుంటే స్టార్ హీరోయిన్‌ హోదా దక్కుతుంది.. లేదంటే టైర్‌ 2 హీరోయిన్‌ గానే కెరీర్‌ లో ముందుకు వెళ్లి.. అలాగే మిగిలి పోవాల్సి వస్తుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం.