Begin typing your search above and press return to search.

ఇండియ‌న్స్ ఆర్ టైగ‌ర్స్.. `జ‌న గ‌ణ మ‌న` షురూ

By:  Tupaki Desk   |   29 March 2022 9:51 AM GMT
ఇండియ‌న్స్ ఆర్ టైగ‌ర్స్.. `జ‌న గ‌ణ మ‌న` షురూ
X
రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ - వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ల తొలి క‌ల‌యిక‌లో తెర‌కెక్క‌తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా `లైగ‌ర్‌`. ముంబై స్ల‌మ్ ఏరియాలోని ఓ ఛాయ్ వాలా కిక్ బాక్సింగ్ లో ఛాంపియ‌న్ గా ఎలా మారాడు. అంత‌ర్జాతీయ స్థాయిలో ఇండియాకు ఎలా గుర్తింపుని తీసుకొచ్చాడు అనే క‌థాంశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌క అతిధి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆగ‌స్టులో ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ - పూరి జ‌గ‌న్నాథ్ క‌లిసి మ‌రో పాన్ ఇండియా మూవీకి శ్రీ‌కారం చుడుతున్నారంటూ గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

`జ‌న‌గ‌ణ‌మ‌న‌` మూవీని ప‌ట్టాలెక్కించాల‌ని పూరి జ‌గ‌న్నాథ్ గ‌త కొన్నేళ్లుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇది ఆయ‌న డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ మూవీనే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేయ‌బోతున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ వార్త‌ల‌ని నిజం చేస్తూ మంగ‌ళ‌వారం `జ‌న‌గ‌ణ‌మ‌న‌` చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ ముంబైలో లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ భారీ చిత్రాన్ని చార్మి, పూరి జ‌గ‌న్నాథ్ ల‌తో క‌లిసి శ్రీ‌క‌ర స్టూడియోస్ బ్యాన‌ర్ పై స్టార్‌ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి నిర్మిస్తున్నారు.

లాండ్ అయిన‌ హెలీకాప్ట‌ర్ లోంచి మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌గా విజ‌య్ దేవ‌రకొండ డాషింగ్ ఎంట్రీ ఇచ్చారు. బ్యాగ్రౌండ్‌లో విజ‌య్ చెబుతున్న మాట‌లు వినిపిస్తున్నాయి. `సావ్‌ధాన్ ... ఇండియ‌న్స్ ఆర్ టైగ‌ర్స్‌.. ఇండియ‌న్స్ ఆర్ ఫైట‌ర్స్‌.. ఇండియ‌న్స్ కెన్ రూల్ దిస్ వ‌ర‌ల్డ్‌... అన‌గానే `జ‌న‌గ‌ణ‌మ‌న‌... అంటూ టైటిల్ సాంగ్ మొద‌లైంది.

మాసీవ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. టైటిల్ ని ఇంగ్లీష్ అక్ష‌రాల్లో షార్ట్ గా `JGM` అని పోస్ట‌ర్ పై వేశారు. ఈ చిత్రానికి పూరి జ‌గ‌న్నాథ్ డైలాగ్స్‌, స్క్రీన్ ప్లే అందిస్తూ డైరెక్ష‌న్ చేస్తున్నారు.

`లైగ‌ర్‌` త‌ర‌హాలోనే ఈ మూవీని కూడా హిందీ, తెలుగు, త‌మిళ‌, మ‌లయాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. సినిమా స్టార్ట్ చేసిన రోజే రిలీజ్ డేట్ ని కూడా పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌క‌టించేశారు. దేశ భ‌క్తి ప్ర‌ధానంగా ఓ మిల‌ట‌రీ ఆఫీస‌ర్ క‌థ‌గా రూపొందిస్తున్న ఈ మూవీని 2023 ఆగ‌స్టు 3న విడుద‌ల చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. తుపాకీ గుళ్ల వ‌ర్షం కురుస్తుండ‌గా ఆకాశంలోంచి సోల్జ‌ర్స్ యుద్ద‌భూమిలోకి దూకుతున్న ఫ‌స్ట్ లుక్ సినిమా ఓ రేంజ్ లో వుంటుంద‌నే సంకేతాల్ని అందిస్తోంది.

ఏప్రిల్ నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో చిత్రీక‌రించ‌బోతున్నారు. మా త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌క‌టించినందుకు చాలా ఆనందంగా వుంది. విజ‌య్ తో ఈ మూవీ చేస్తున్నందుకు చాలా గ్రేట్ గా ఫీల‌వుతున్నాన‌ని ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ తెలిపారు. ఈ మూవీ విష‌యంలో చాలా ఎక్సైటెడ్ గా వున్నానని, ఛాలెంజింగ్ స్క్రిప్ట్ ఇది. ప్ర‌తీ భార‌తీయుడిని క‌దిలిస్తుంది` అని హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నారు.