Begin typing your search above and press return to search.

NBK-107 వేడెక్కించే అప్ డేట్

By:  Tupaki Desk   |   11 April 2022 4:12 PM GMT
NBK-107 వేడెక్కించే అప్ డేట్
X
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అఖండ ఘనవిజయం తర్వాత అత‌డు మ‌రింత స్పీడ్ పెంచాడు. యువ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి తాత్కాలికంగా NBK 107 అని పేరు పెట్టారు. ఈ రోజు వరకు, టీమ్ సిరిసిల్లలో బాలకృష్ణ స‌హా కీల‌క న‌టీన‌టుల‌పై హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను కొన్ని ప్రధాన సన్నివేశాలను రూపొందించారు.

త‌దుప‌రి హైదరాబాద్ ఆర్‌.ఎఫ్‌.సిలో ఈరోజు కొత్త షెడ్యూల్ ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి థమన్ ఎస్.ఎస్ సంగీతం అందిస్తున్నారు.

న‌ట వార‌సుడిని బ‌రిలో దించుతున్నారా?

త‌దుప‌రి ఆదిత్య 369 సీక్వెల్ కోసం బాల‌య్య ప్రిప‌రేష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. దీనివ‌ల్ల‌ అనీల్ రావిపూడితో మూవీని వేగంగా పూర్తి చేయ‌నున్నారు. అనీల్ రావిపూడి ప్ర‌స్తుతం ఎఫ్ 3 నిర్మాణానంత‌ర ప‌నుల్ని సాగిస్తున్నారు. ఇక‌ ఎన్.బి.కే న‌ట‌వార‌సుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ మూవీ కోసం ఇప్ప‌టి నుంచే బాల‌య్య భారీ ప్లానింగ్ తో ఉన్నారు.

ఆ ప్రాజెక్ట్ త‌న‌కు ఎంతో కీల‌క‌మైన‌ది. త‌న‌యుడిని స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో లాంచ్ చేయాల‌న్న ఆలోచ‌న కూడా బాల‌య్య బాబుకి ఉంది. మోక్ష‌జ్ఞ ఎంట్రీ మూవీ గురించి బోలెడంత చ‌ర్చ సాగింది. ఆదిత్య 369 సీక్వెల్ లో అత‌డు న‌టిస్తాడ‌ని బాల‌య్య అతిథిగా క‌నిపిస్తార‌ని.. `ఆదిత్య 999 మ్యాక్స్` అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని కూడా ప్ర‌చార‌మైంది. ఈ మూవీ ఎన్.బి.కే లైఫ్ లోనే స్పెష‌ల్ మూవీ కానుంది. అందువ‌ల్ల ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహించ‌లేమ‌ని గుస‌గుస వినిపిస్తోంది