Begin typing your search above and press return to search.

బాల‌య్య సినిమాకు గోపీచంద్‌ 'క్రాక్' ఫార్ములా

By:  Tupaki Desk   |   22 Feb 2022 10:30 AM GMT
బాల‌య్య సినిమాకు గోపీచంద్‌ క్రాక్ ఫార్ములా
X
కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చారు నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ. హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను - బాలయ్య‌ల కాంబినేష‌న్ లో వ‌చ్చిన మూడ‌వ చిత్రం `అఖండ`. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం పేర‌కు త‌గ్గ‌ట్టే అఖండ విజ‌యాన్ని సాధించి టాలీవుడ్ వ‌ర్గాల‌కు స‌రికొత్త జోష్ ని అందించింది. భారీ చిత్రాలు రిలీజ్ చేస్తే ప్రేక్షులు థియేట‌ర్ల‌ల‌కు వ‌స్తారా? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అనుమానంగా చూస్తున్న వేళ వారి అనుమానాల్ని ప‌టాపంచ‌లు చేసింది.

బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి వ‌సూళ్ల ప‌రంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ జోష్ లో వున్న నంద‌మూరి బాల‌కృష్ణ వెంట‌నే త‌న 107వ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించారు. `క్రాక్‌` మూవీ తో బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేసిన గోపీచంద్ మ‌లినేని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఎన్ బీకే 107` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభిచారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని సిరిసిల్ల‌లో ప్రారంభించారు.

వేటపాలెం ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని ప‌వ‌ర్ ఫుల్ ఎంట‌ర్ టైనర్ గా ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో బాల‌య్య డ్యుయెల్ రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా బ‌య‌టికి వ‌చ్చిన బాల‌య్య లుక్ ప‌లు అనుమానాల్ని రేకెత్తిస్తోంది. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో.. డిఫ‌రెంట్ మేకోవ‌ర్ తో బాల‌య్య క‌నిపిస్తున్న ఓల్డ్ లుక్ నెట్టింట వైర‌ల్ గా మారింది. తాజాగా లీక్ అయిన ఫొటోల‌ని బ‌ట్టి ఇది ఓ క‌న్న‌డ సినిమా ఆధారంగా తెర‌కెక్కుతున్న‌ట్టుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

గ‌తంలో `క్రాక్ ` చిత్రానికి `త‌మిళ చిత్రం `సేతుప‌తి`ని ఆధారంగా చేసుకుని దానికి య‌దార్థ సంఘ‌ట‌న‌ల‌ని జోడించి ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ప‌వ‌ర్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా తీర్చి దిద్దారు. సేమ్ అదే ఫార్ములాని బాల‌కృష్ఱ 107 వ చిత్రానికి ఫాలో అవుతూ తెర‌క్కిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

`క్రాక్‌` మూవీని `సేతుప‌తి` లైన్ ని ఆధారం చేసుకుని తెర‌పైకి తీసుకొచ్చిన ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని తాజాగా చేస్తున్న బాల‌య్య సినిమాని క‌న్న‌డ హిట్ ఫిల్మ్ `ముఫ్తీ` ఆధారంగా చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజా విడుద‌ల చేసిన బాల‌కృష్ణ ఫ‌స్ట్ లుక్ `ముఫ్తీ` లోని శివ‌రాజ్ కుమార్ పాత్ర‌ని పోలివుండ‌టం .. ప‌క్కాగా చెప్పాలంటే మ‌క్కీ టూ మక్కీ దించేయ‌డం ప‌లు అనుమానాలని రేకెత్తిస్తోంది.

`ముఫ్తీ` చిత్రం శివ‌రాజ్ కుమార్‌, శ్రీ‌ముర‌ళి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 2017లో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ మెయిన్ ప్లాట్ ని తీసుకుని వేట‌పాలెం ప‌రిస‌రాల్లో జ‌రిగిన య‌దార్ధ సంఘ‌ట‌న‌ల్ని జోడించి బాల‌కృష్ణ మూవీని గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్న‌ట్టుగా చెబుతున్నారు. చిత్ర బృందం మాత్రం అదేమీ లేద‌ని చెబుతోంది. ఏది నిజం ఏది అబ‌ద్ధం అన్న‌ది తెలియాలంటే సినిమాకు సంబంధించిన మరిన్ని వివ‌రాలు బ‌య‌టికి వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.