Begin typing your search above and press return to search.

విడాకుల తరువాత చైతూ దూసుకుపోతాడా? సామ్ గ్రాఫ్ పడిపోతుందా?

By:  Tupaki Desk   |   5 Oct 2021 4:31 AM GMT
విడాకుల తరువాత చైతూ దూసుకుపోతాడా? సామ్ గ్రాఫ్ పడిపోతుందా?
X
పెళ్లి - విడాకులు ఈ విషయాలలో ఎవరి అభిప్రాయం వారిది .. ఎవరి నిర్ణయం వారిది. కానీ సమంత - చైతూ విడాకుల విషయాన్ని గురించి అంతా మాట్లాడుకున్నారు .. ఖాళీగా ఉన్నవారు చర్చించుకున్నారు. ఎప్పుడు చూసినా చిలక .. గోరింకల్లా ఉండేవారు, విడిపోతారని అసలు అనుకోలేదు అనే మాట అందరి నోటా వినిపిస్తోంది. అయితే వాళ్లు విడిపోతారనే విషయాన్ని 'వేణుస్వామి' ముందుగానే చెప్పారు అనే మాట మరికొందరి నోట వినిపిస్తోంది. అవును ఆయన ముందుగానే అన్నారని గుర్తుచేసుకుంటున్నారు.

వేణుస్వామి ఎవరనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. సెలబ్రిటీల జాతకాలను గురించి ఆయన సోషల్ మీడియా ద్వారా చెబుతూ ఉంటారు. తాను చెప్పింది తప్పకుండా జరుగుతుందంటూ, ఆ మాటపై ఆయన బలమైన వాదనలు చేస్తుంటారు కూడా. అవసరమైతే టీవీ ఛానల్స్ కి వెళ్లి లైవ్ లో కూడా అదే మాట చెబుతుంటారు. అవకాశం లేకపోతే ఫోన్ ద్వారా లైవ్ కి కనెక్ట్ అవుతుంటారు. ఒకానొక సమయంలో జాతకాలు అనే టాపిక్ పై బాబు గోగినేనికి .. వేణుస్వామికి మధ్య లైవ్ లో జరిగిన యుద్ధాన్ని ఎవరూ మరిచిపోలేదు.

అఖిల్ కి శ్రియ అనే బిజినెస్ మెన్ కూతురితో నిశ్చితార్థం జరిగినప్పుడు, అది సక్సెస్ కాదని ఆయన చెప్పారు. అలాగే జరిగింది కూడా. ఆ తరువాత ఆయన చైతూ - సమంత వైవాహిక బంధం కూడా నిలబడదని జోష్యం చెప్పారు. ఇద్దరి జాతకం సరిపడని కారణంగా వారు విడిపోయే అవకాశాలు ఎక్కువని అన్నారు. జాతక దోషాల వలన ఇలా జరుగుతుందని చెప్పారు. ఆ విషయాన్ని నిజం చేస్తూ సమంత .. చైతూ విడిపోయారు. ఈ విషయంపై గతంలో ఆయన పెట్టిన పోస్టు ఇపుడు వైరల్ అవుతోంది. ఈ విషయం కొంతమంది చర్చల్లో చోటు చేసుకుంటోంది.

ఇక సమంత .. చైతూ ఇద్దరూ విడిపోతారని మాత్రమే కాదు, ఆయన ప్రస్తావించిన మరో విషయం ఇక్కడ ఆసక్తికరం. విడాకులు తీసుకున్న తరువాత చైతూ సక్సెస్ గ్రాఫ్ పెరుగుతుంది. ఆయన పాపులారిటీ పెరిగిపోతుంది. అదే సమయంలో సమంత సక్సెస్ గ్రాఫ్ తగ్గుతూ వెళుతుంది అని చెప్పుకొచ్చారు. చైతూ ఎదుగుదలకు 'లవ్ స్టోరీ' సినిమా అనేది ఒక ఆరంభమవుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది. అయితే వేణుస్వామి గతంలో చెప్పిన చాలా విషయాలు, అందుకు భిన్నంగా జరిగాయి. ఆయన గెస్ చేసిన ఒకటి రెండు విషయాలు నిజమైనంత మాత్రాన, ఆ విషయంపై చర్చలు .. రచ్చలు అవసరం లేదనే అభిప్రాయాలు కూడా సోషల్ మీడియాలో జోరుగానే షికారు చేస్తున్నాయి.