Begin typing your search above and press return to search.

ఎడారిలో .. ఎర్రటి ఎండల్లో నాగ్ ఫైట్స్!

By:  Tupaki Desk   |   15 March 2022 1:30 PM GMT
ఎడారిలో .. ఎర్రటి ఎండల్లో నాగ్ ఫైట్స్!
X
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ది ఘోస్ట్' సినిమా రూపొందుతోంది. నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'బంగార్రాజు' వంటి విలేజ్ నేపథ్యంతో కూడిన కథను చేసిన నాగార్జున, ఆ తరువాత చేస్తున్న సినిమా ఇది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా లొకేషన్ నుంచి మరికొన్ని ఫోటోలు వదిలారు. 'దుబాయ్' ఎడారిలోని ఎర్రటి ఎండల్లో నాగార్జున యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్న సన్నివేశాలు అవి.

ఇసుకలో దూసుకుని వెళ్లే బైక్ తో ఆయన విలన్ గ్యాంగ్ ను ఛేజ్ చేసే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎడారిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఈ సమయంలో నాగ్ రిస్క్ చేస్తుండటం విశేషమే. పైన ఎండ .. క్రింద ఇసుక వేడి .. ఎటు చూసినా ఎండనే.

అలాంటి వాతావరణంలో ఒక్కో షాట్ ఒకటికి రెండు సార్లు చేయవలసి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, నాగ్ లాంటివారికి అది చాలా కష్టాన్ని కలిగించే విశేషమే. అందుకు ఈ వయసులోను ఆయన సిద్ధపడటం విశేషం. ఇసుకలోను ఆయన బైక్ నడపడానికి రెడీ అవుతున్నారు.

ప్రవీణ్ సత్తారు ఛేజింగ్ సీన్స్ ను తనదైన మార్కుతో బాగా తీస్తాడు. 'గరుడ వేగ' ఆ విషయాన్ని నిరూపించింది. ఇప్పుడు అంతకి ఎంత మాత్రం తగ్గకుండా ప్రవీణ్ సత్తారు ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా సోనాల్ చౌహన్ ను తీసుకున్నారు. ఆమె కాంబినేషన్లోని నాగ్ సీన్స్ ను కూడా ఇటీవలే చిత్రీకరించారు.

సోనాల్ అనగానే ఆమె నుంచి ఎవరూ కూడా యాక్టింగును ఆశించరు. ఆమెకి ఇచ్చే పాత్రలు కూడా గ్లామర్ టచ్ తోనే ఉంటాయి. ఇంతకుముందు ఆమె చేసిన పాత్రలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

ఈ సినిమాకి ముందు నాగ్ చేసిన 'ఆఫీసర్' .. 'వైల్డ్ డాగ్' సినిమాలు ఆశించిన స్థాయి విజయాలను అందుకోలేదు. అయినా ఆయన మరోసారి యాక్షన్ కథను పట్టుకునే రంగంలోకి దిగితున్నారు. డిఫరెంట్ లుక్ తో నాగార్జున కనిపించనున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. మరి ఈ యాక్షన్ సినిమాతో నాగ్ హిట్ కొడతాడేమో చూడాలి. హిట్ కొడితేనే ఆయన పడిన ఈ కష్టానికి ఒక అర్థం .. ప్రయోజనం ఉంటాయి.