Begin typing your search above and press return to search.

తాజా సెన్సేష‌న్.. అల్ల‌రి అల్లు అర్హ తెరంగేట్రం

By:  Tupaki Desk   |   10 July 2021 4:30 AM GMT
తాజా సెన్సేష‌న్.. అల్ల‌రి అల్లు అర్హ తెరంగేట్రం
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వార‌సురాలు అల్లు అర్హ‌ను ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అర్హ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాల్లో పెద్ద సెల‌బ్రిటీ. త‌న‌కంటూ ప్ర‌త్యేకించి ఫాలోయింగ్ ఉంది. అర్హ అల్ల‌రి చేసినా లేదా ముద్దు ముద్దుగా మాట్లాడినా ఏం చేసినా అందుకు సంబంధించిన వీడియోల‌ను ఇంత‌కుముందు బ‌న్ని త‌న సోష‌ల్ మీడియాల ద్వారా షేర్ చేయ‌గా అవ‌న్నీ అభిమానుల్లోకి వైర‌ల్ గా దూసుకెళ్లాయి.

ఇటీవ‌ల అంజ‌లి అంజ‌లి వీడియో సాంగ్ ను అర్హాతో పునః సృష్టించారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఎట్ట‌కేల‌కు అర్హ బాల‌న‌టిగా తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ దిల్ రాజు నిర్మించ‌నున్న చిత్రంలో బాల‌న‌టిగా ఆరంగేట్రం చేయ‌నుంద‌ని తెలుస్తోంది. నిజానికి బ‌న్ని కెరీర్ కి ఎంతో కీల‌క‌మైన ఆర్య లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించిన దిల్ రాజుతోనే ఇప్పుడు సెంటిమెంటుగా అల్లు అర్హ‌తో సినిమాని ప్లాన్ చేస్తున్నార‌ట‌. బాల‌ల చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న రాజుగారు అర్హ‌ను ప్ర‌ధాన పాత్ర‌కు ఎంపిక చేసుకున్నారు. ఇదే చిత్రంలో ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురి వార‌సులు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యేందుకు అవ‌కాశం ఉందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీప్రొడ‌క్ష‌న్ కాస్టింగ్ సెల‌క్ష‌న్ సాగుతోంది. అల్లు అర్హ కోసం బ‌న్నితో ఇప్ప‌టికే చ‌ర్చ‌లు సాగిస్తున్నారు. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ త‌న‌యుడు అయాన్ న‌టిస్తాడా లేదా? అన్న‌ది చూడాలి. ఇది పౌరాణిక‌మా సాంఘీక‌మా.. బాల రామాయ‌ణం త‌ర‌హానా? అన్న‌దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని భావిస్తున్నారు.