Begin typing your search above and press return to search.

సినిమా వివాదం సర్థుమనిగిందో లేదో పుకార్లు షురూ

By:  Tupaki Desk   |   15 Nov 2021 10:36 AM GMT
సినిమా వివాదం సర్థుమనిగిందో లేదో పుకార్లు షురూ
X
ఇండియన్ 2 సినిమా కు సంబంధించి నెలకొన్న వివాదాలు అన్ని కూడా సర్దుమనిగినట్లే అంటూ తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. లైకా ప్రొడక్షన్స్ మరియు దర్శకుడు శంకర్ ల మద్య ఒప్పందం కుదరడంతో మళ్లీ ఇండియన్ 2 పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే చరణ్ తో ప్రస్తుతం శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా తర్వాత ఇండియన్ 2 సినిమా మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పట్లో ఇండియన్‌ 2 కు సంబంధించిన పునః ప్రారంభ విషయాలు అధికారికంగా చర్చకు వచ్చే అవకాశం లేదు. చరణ్‌ తో మూవీ సినిమా ను పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఇండియన్ 2 గురించి మాట్లాడుతాను అంటూ శంకర్ ముందుగానే చర్చల సందర్బంగా చెప్పేసినట్లుగా తెలుస్తోంది. అంటే శంకర్‌ ఇంకా ఇండియన్‌ 2 సినిమా ను టేకప్‌ చేసేందుకు సమయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చ ఏడాది సమ్మర్‌ తర్వాత కాని ఇండియన్ 2 పనులు తిరిగి ప్రారంభః అయ్యే అవకాశం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్న సమయంలో ఒక పుకారు అప్పుడే మొదలు అయ్యింది.

కమల్ కు జోడీగా ఈ సినిమా లో కాజల్‌ ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఆమె పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇలాంటి సమయంలో ఇండియన్‌ 2 నుండి కాజల్‌ ను తప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ప్రెగ్నెంట్‌ అవ్వడం వల్ల ఇండియన్‌ 2 లో ఆమె నటించే అవకాశం లేదని.. అందుకే ఆ స్థానంలో త్రిషను తీసుకునే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. కాజల్‌ ప్రెగ్నెన్సీ వార్తలు ఇంకా కన్ఫర్మ్‌ అవ్వనే లేదు... అప్పుడే ఆమె గురించి రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆమద్య నాగార్జున సినిమా లో కాజల్‌ ను తప్పించారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో ఇండియన్ 2 నుండి అంటున్నారు. ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ దాదాపుగా సగం పూర్తి అయ్యింది. ఇలాంటి సమయంలో హీరోయిన్‌ మార్చడం సాధ్యమేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కాజల్‌ అగర్వాల్‌ నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో కాజల్ కు పెళ్లి అయ్యింది. పెళ్లి తర్వాత కూడా కొన్ని రోజులు ఆచార్య కోసం వర్క్‌ చేసింది. నాగార్జున ఘోస్ట్‌ సినిమా కు కూడా ఈమె ఓకే చెప్పింది. కాని కరోనా వల్ల షూటింగ్‌ ఆలస్యం అవ్వడం వల్ల ఆ ఆఫర్‌ ఆమెకు చేజారినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా ఆ విషయమై స్పందన రావాల్సి ఉంది. ఇటీవలే గర్బం గురించి ప్రశ్నించిన సమయంలో కాజల్‌ ఆ విషయం తాను స్వయంగా ప్రకటించేందుకు కొంత సమయం పడుతుంది అన్నట్లుగా అనుమానాలు పెంచేసింది. ఇంతకు ఈమె ప్రెగ్నెంట్‌ అయ్యి ఉంటుందా లేదా అనే విషయంలో క్లారిటీ మరింతగా రావాల్సి ఉంది.