Begin typing your search above and press return to search.

'గ‌ని' ఇంకా ఎప్పుడు వ‌స్తాడో?

By:  Tupaki Desk   |   2 March 2022 7:30 AM GMT
గ‌ని ఇంకా ఎప్పుడు వ‌స్తాడో?
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క‌థానాయ‌య‌కుడిగా న‌టించిన `గ‌ని` రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రారంభించి...షూటింగ్ పూర్తిచేసి చాలా కాల‌మ‌వుతోంది. మ‌ధ్య‌లో క‌రోనా కార‌ణంగా కొంత ఆటంకం ఎదురైన‌ప్ప‌టికీ తాజాగా అన్ని ప‌నుల్ని పూర్తిచేసుకుంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు రిలీజ్ తేదీలు ప్ర‌క‌టించింది వెన‌క్కి తీసుకోవ‌డం జ‌రిగింది. ఆ సినిమా వాయిదాకి కార‌ణాలు ఏంట‌న్న‌వి ఇప్ప‌టికీ స‌రైన క్లారిటీ లేదు. `గ‌ని` కంటే ముందు వెనుక ప్రారంభ‌మైన చిత్రాలు రిల‌జీ్ అయ్యాయి గానీ...`గ‌ని`కి మాత్రం మోక్షం క‌ల‌గ‌లేదు. మ‌రి రిలీజ్ ప్లానింగ్ లోప‌మా? ఇంకేమైనా కార‌ణాలు ఉన్నాయా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

తాజాగా ఇటీవ‌లే సెన్సార్ ప‌నులు కూడా పూర్తిచేసుకుంది. సెన్సార్ U/A స‌ర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో సినిమా ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌క‌టించారు. కానీ అది కూడా సాధ్య‌ప‌డ‌లేదు. ఆ తేదీన `భీమ్లానాయ‌క్` స‌హా..అంత‌కు ముందు రోజున `వ‌లిమై` లాంటి సినిమాలు రిలీజ్ అవ్వ‌డంతో పోటీని దృష్టిలో పెట్టుకుని వెన‌క్కి త‌గ్గిన్లట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 8న చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి మ‌రో ముహూర్తం ఫిక్స్ చేసారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఆ తేదీకి రిలీజ్ చేయాల‌ని టీమ్ కంక‌ణం క‌ట్టుకుని ముందుకు వెళ్తోందిట‌. అయితే ఈ డిలేకి ప్ర‌ధాన కార‌ణం భారీ ఎత్తున రిలీజ్ చేయాల‌న్న ఉద్దేశంతోనే అంత‌కంకంత‌కు ఆల‌స్యం చేస్తున్న‌ట్లు గుస‌గుస వినిపిస్తోంది.

బాక్సింగ్ నేప‌థ్యంతో కూడిన సినిమా...వ‌రుణ్ ని హీరోగా మ‌రింత హైలైట్ చేసే అంశాలున్నాయి. అందుకే మంచి ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చినా కేవ‌లం థియేట‌ర్ రిలీజ్ కే మొగ్గు చూపిన‌ట్లు తెలుస్తోంది. కాబ‌ట్టి వీలైన‌న్ని ఎక్కువ థియేట‌ర్లో రిలీజ్ చేసి వారంతంలోనే వ‌సూళ్లు సాధించాల‌న్న టార్గెట్ గా క‌నిపిస్తోంది.

సినిమాలో చాలా ఇంటెన్స్ స‌న్నివేశాలుంటాయ‌ని...ప్రేక్ష‌కుల్ని ఎంగేజ్ చేయ‌డంలో సీట్ అంచున కూర్చోబెడ‌తాయ‌ని టీమ్ ధీమా వ్య‌క్తం చేస్తోంది. ఆ న‌మ్మ‌కంతోనే రిలీజ్ విష‌యంలో మేక‌ర్స్ ఆచితూచి ఆలోచ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈచిత్రంతో అల్లు అర‌వింద్ కుమారుడు బాబి నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఆ కార‌ణంగానూ మార్కెట్ లోకి ఓ బ్రాండ్ గా రావాల‌ని ప‌క్కా ప్లాన్ తో బ‌రిలోకి దిగుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ తేదీకైనా `గ‌ని` వస్తాడో ? లేదో ? ఈ చిత్రంలో వ‌రుణ తేజ్ బాక్స‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే వ‌రుణ్ టోన్ లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. యాక్ష‌న్ హీరోగా ఫోక‌స్ అవుతాడ‌ని మెగా ఫ్యామిలీ ధీమాగా ఉంది. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పాట‌లు శ్రోత‌ల్ని ఆక‌ట్టుకుంటున్నాయి. కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

రెనైసాన్స్ పిక్చ‌ర్స్ అల్లు బాబి కంపెనీల‌పై సిద్దు ముద్దా-బాబి నిర్మించారు. అల్లు అర‌వింద్ స‌మర్పిస్తున్నారు. సాయి మంజ్రేక‌ర్..జ‌గ‌ప‌తి బాబు.. ఉపేంద్ర‌..సునీల్ శెట్టి.. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.