Begin typing your search above and press return to search.

లవ్ టుడేని వదలని దిల్ రాజు.. మరో సూపర్ ప్లాన్..!

By:  Tupaki Desk   |   27 Nov 2022 8:30 AM GMT
లవ్ టుడేని వదలని దిల్ రాజు.. మరో సూపర్ ప్లాన్..!
X
కోలీవుడ్ లో యూత్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్టైన లవ్ టుడే మూవీని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు దిల్ రాజు. సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే ఉద్దేశంతో షేరింగ్ ఒప్పందంతో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు.

సినిమాకు తెలుగులో కూడా మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా యువత ఈ మూవీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టీజర్, ట్రైలర్ ఇంట్రెస్ట్ కల్పించడంతో లవ్ టుడే మూవీకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.

సినిమా హీరో ప్రదీప్ రంగనాథ్ హీరోయిన్ కూడా సినిమాని తెలుగులో బాగా ప్రమోట్ చేశారు.

దిల్ రాజు చేతుల్లోకి వచ్చాక ఈ మూవీ రేంజ్ మారిపోయింది. అయితే కేవలం తెలుగులోనే కాదు హిందీలో కూడా ఈ మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే అక్కడ డబ్బింగ్ వర్షన్ కాకుండా అక్కడ రీమేక్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. దిల్ రాజు సలహాకి తమిళ నిర్మాతలు ఓకే అనడంతో లవ్ టుడే మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నారని తెలుస్తుంది. హిందీ రీమేక్ లో లవ్ టుడే నిర్మాతలతో పాటుగా దిల్ రాజు కూడా భాగస్వామ్యం అవుతున్నారట. ఆల్రెడీ హిందీలో జెర్సీ, హిట్ సినిమాలను రీమేక్ చేశారు దిల్ రాజు. ఆ అనుభవం ఈ మూవీకి ఉపయోగపడనుంది.

లవ్ టుడే హిందీ రీమేక్ లో ఎవరు నటిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయ్యింది. అక్కడ యువ హీరోలతో ఈ మూవీ రీమేక్ ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. అంతేకాదు హీరోయిన్ గా కూడా స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని చూస్తున్నారట. సో చిన్న సినిమాగా రిలీజై తమిళంలో సూపర్ హిట్ అయిన లవ్ టుడే తెలుగులో కూడా అదే ఫలితాన్ని అందుకుని ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్తుంది. సినీ ప్రేక్షకులంతా సినిమా నచ్చితే భాషతో సంబంధం లేకపోయినా హిట్ చేస్తున్నారు.

ముఖ్యంగా సౌత్ సినిమాలన్ని బాలీవుడ్ లో విజయ బావుటా ఎగురవేస్తున్నాయి. ఈ క్రమంలో లవ్ టుడే రీమేక్ కూడా బీ టౌన్ ఆడియన్స్ కి బాగా నచ్చేస్తుందని చెప్పొచ్చు. ఈ రీమేక్ లో కాస్టింగ్ ఎవరు.. డైరక్షన్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.