Begin typing your search above and press return to search.

స్కినైటైట్ లో జాన్వీ దుమారం..దండాల‌మ్మో!

By:  Tupaki Desk   |   11 March 2022 11:30 AM GMT
స్కినైటైట్ లో జాన్వీ దుమారం..దండాల‌మ్మో!
X
ఆరంభం ఈ అమ్మడి అందంపై పెదవి విరిచేశారు. అతిలోక సుందరి వారసత్వాన్ని నిలబెడుతుందా? అంటూ సందేహించారు. నటిగా శ్రీదేవి అంత పాపులరవుతుందా? అన్నారు. `ధడక్` చిత్రంతో యావరేజ్ అన్నారు.

కానీ ఆ తర్వాత నెమ్మదిగా సీన్ మారిపోతోంది. ఒక్కోరోజు ఒక్కో విధంగా జాన్వీ కపూర్ రూపాంతరం యువతరంలో వేడి పుట్టిస్తోంది. ఇప్పుడు జాన్వీ అందం గురించి నటప్రతిభ గురించి ఎలాంటి సందేహాల్లోవ్.

కరీనా.. కత్రిన..అలియ‌భట్ రేంజు అని నిరూపించుకునేందుకు దశాబ్ధం కెరీర్ ని రన్ చేయాల్సి ఉండొచ్చేమో కానీ నేటి జనరేషన్ లో జాన్వీ రేంజే వేరు. సాటి నటవారసురాళ్లకు ధీటుగా రాణిస్తోంది. అలాగే జాన్వీకపూర్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు.

డిజైనర్ దుస్తుల్లో హీట్ పుట్టించడం ఈ బ్యూటీకి ఓ హాబీ. పొట్టి నిక్కర్లలో.. స్కిన్ టైట్ దుస్తుల్లో.. బికినీ లో కాకలు రేపడం ఈ బ్యూటీ ప్రత్యేకత. తాజాగా బ్యూటీ జిమ్ లో వంగ‌పువ్వు రంగు స్కిన్ టైట్ దుస్తుల్లో మంట‌లు రేపుతోంది.

రెండు చేతులు జోడించి సూర్య న‌మ‌స్కారం చేస్తోన్న ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇదో ర‌క‌మైన యోగాస‌నంలా కనిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది.

జాన్వీ అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేసి సంతోషిస్తున్నారు. ఇలాంటి ఎలివేష‌న్స్ జాన్వీ కొత్తేం కాదు. గ‌తంలోనూ ప‌లుమార్లు స్కిన్ టైట్ దుస్తుల్లో మంట‌లు రేపిన సంద‌ర్భాలున్నాయి.

ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కరణ్ జోహార్ బ్యానర్లో `దోస్తానా-2` లో నటిస్తోంది. అదే బ్యానర్ లో మరో రెండు చిత్రాలు కమిట్ అయింది. అలాగే అమ్మడు నటించిన `గుడ్ లక్ జెర్రీ` సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది.

`మిలీ` అనే మరో చిత్రంలో కూడా నటిస్తుంది. వచ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక దక్షిణాదిన ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఆసక్తిగానే ఉంది. కానీ సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది.

ఆ ఛాన్స్ వస్తే వదులుకోవడానికి ఎంత మాత్రం సిద్దంగా లేదు. తల్లి తరహాలోనే అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని ప్రణాళికతో ముందుకు వెళ్తోంది