Begin typing your search above and press return to search.

ఫోటోటాక్: లెద‌ర్ దుస్తుల్లో దాచేసిన‌ నిధులిలా?

By:  Tupaki Desk   |   11 April 2022 5:37 AM GMT
ఫోటోటాక్: లెద‌ర్ దుస్తుల్లో దాచేసిన‌ నిధులిలా?
X
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ అన్ లిమిటెడ్ సోషల్ మీడియా ట్రీట్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ భామ కూడా సాటి నాయికల్లానే కాంపిటీషన్ లో గ్రాఫ్ పెంచుకోవాలని తపిస్తోంది. ఆ క్రమంలోనే నెవ్వర్ బిఫోర్ హాట్ ఫోటోషూట్లతో వెబ్ లో విరుచుకుపడుతోంది. తాజాగా బ్లాక్ లెద‌ర్ దుస్తుల్లో అగ్గిరాజేస్తున్న ఫోటోషూట్ తో అంతర్జాలంలో మంటలు రేపుతోంది. సమ్మర్ హీట్ కి తగ్గట్టే ఈ అమ్మడి కూల్ యాటిట్యూడ్ అగ్గి రాజేస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారింది.

బ్లాక్ లెద‌ర్ లో క్లీవేజ్ అందాలు మ్యాచింగ్ పొట్ట‌లి నిర్క‌రులో థై అందాల ఎలివేష‌న్ తో కుర్ర‌కారుని ఫిదా చేస్తోంది. ఈ రెండింటి ఎలివేష‌న్ త‌ట్టుకోవ‌డ‌మే క‌ష్ట‌మ‌నుకుంటే అంత‌కు మించిన కొంటె చూపులో లాక్ చేస్తోంది. పెద‌వుకుల లైట్ గా లిప్ స్టిక్ పూసుకుని స్టూల్ పై కుర్చుని అమ్మ‌డు వ‌య్యారంగా కెమెరాకి ఫోజులిచ్చింది. ఈ ఫోటోని గంట ముందే ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. నిధి అగ‌ర్వాల్ అభిమానులు హాట్ కామెంట్ల‌తో విరుచుకు ప‌డుతున్నారు.

నిధి కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ హిస్టారికల్ పీరియడ్ మూవీ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే తమిళంలో సెల్వరాఘవన్ శిష్యుడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. మరిన్ని ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించిన సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.

నిధి అగర్వాల్ పుట్టింది హైదరాబాదే అయినా పెరిగింది మాత్రం బెంగుళూరులో. అందుకే ఈ భామను బెంగుళూరు భామ అంటున్నారు. బాలీవుడ్ ఫిలిం 'మున్నా మైఖేల్' తో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి 'సవ్యసాచి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత 'Mr.మజ్ను' లో నటించింది.

కానీ `ఇస్మార్ట్ శంక‌ర్` సినిమాతోనే బాగా ఫేమ‌స్ అయింది. ఆ సినిమా స‌క్సెస్ తో మూడు నాలుగు ప్రాజెక్టుల్లో న‌టించింది. కానీ అవేవి స‌క్సెస్ అవ్వ‌క‌పోడంతో అమ్మ‌డు రేసులో వెనుక‌బ‌డిపోయింది. ప్ర‌స్తుతం నిధి ఆశ‌ల‌న్నీ ప‌వ‌న్ సినిమాపైనే ఉన్నాయి