Begin typing your search above and press return to search.

`జ‌న‌గ‌ణ‌మ‌న‌`కి పూరి ప‌క్కా ప్లాన్ రెడీ

By:  Tupaki Desk   |   2 March 2022 2:50 AM GMT
`జ‌న‌గ‌ణ‌మ‌న‌`కి పూరి ప‌క్కా ప్లాన్ రెడీ
X
`వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వర్‌` త‌రువాత రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి సినిమా విడుద‌లై దాదాపు మూడేళ్లు కావస్తోంది. అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా? అని రౌడీ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారి విజ‌య్ దేవ‌ర‌కొండ పాన్ ఇండియా మూవీతో త‌న ఫ్యాన్స్ తో పాటు స‌గ‌టు మూవీ ల‌వ‌ర్స్ ని కూడా ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి రెడీ అయిపోతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం `లైగ‌ర్‌`. బాక్స‌ర్ గా న‌టిస్తున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ఫ‌స్ట్ గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ముంబై స్ట్రీట్ ల‌లో తిరిగే స్ల‌మ్ డాగ్ గా చాయ్ వాలాగా ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపించ‌బోతున్నాడు. వీ ఆర్ ఇండియ‌న్స్ .. వాట్ ల‌గాదేండే.. అంటూ రింగ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న విజువ‌ల్స్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ .. కొంత మంది ఫైట‌ర్స్ పై చిత్రీక‌రించిన ఛేజింగ్ ఫైట్స్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. అన‌న్యా పాండే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో హాలీవుడ్ ఫేమ‌స్ బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు.

దీంతో ఈ మూవీ పాన్ ఇండియాని మించి వ‌ర‌ల్డ్ వైడ్ గా వైర‌ల్ గా మారింది. అంతే కాకుండా ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో బాలీవుడ్ న‌టులు రోనిత్ రాయ్‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, అబ్దులు ఖాదిర్ అమిన్ న‌టిస్తున్నారు. హాలీవుడ్ యాక్ష‌న్ స్పోర్ట్స్ డ్రామాకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో  రూపొందుతున్న ఈ మూవీ ద్వారా విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్ కు ప‌రిచయం కాబోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కి పూరి, చార్మీల‌తో క‌లిసి బాలీవుడ్ కు చెందిన క‌ర‌ణ్ జోహార్, అపూర్వ మెహ‌తా, హీరూ య‌ష్ జోహార్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఉత్తరాదిలోనూ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇదిలా వుంటే ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. కోవిడ్ కార‌ణంగా గ‌త కొంత కాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీని అనుకున్న టైమ్ లో రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ పూర్తి చేసే ప‌నిలో వున్నారు. ఈ నెలాఖ‌రుకి ఫ‌స్ట్ కాపీని సిద్దం చేయ‌బోతున్నారు. ఫ‌స్ట్ కాపీ వచ్చిన వెంట‌నే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాథ్ క‌లిసి విదేశాల‌కు వెళ్ల‌బోతున్నారు.

`లైగ‌ర్‌` పూర్త‌యిన వెంట‌నే పూరి జ‌గ‌న్నాథ్ తో మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. గ‌త కొంత కాలంగా త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకుంటున్న `జ‌న‌గ‌ణమ‌న‌` ని విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పూరి జ‌గ‌న్నాథ్ చేయ‌డానికి రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే స్క్రిప్ట్ పూర్తి చేసిన పూరి జ‌గ‌న్నాథ్ వెంట‌నే ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించేందుకు రెడీ అయిపోతున్నారు. ఇందు కోసం ఇప్ప‌టికే ప‌క్కా ప్లాన్ ని సిద్ధం చేసిన పూరి జ‌గ‌న్నాథ్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కోసం విదేశాల‌కు వెళ్ల‌బోతున్నార‌ట‌.

 అక్క‌డే ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ని పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించాల‌నుకుంటున్నార‌ట‌. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ మిలిట‌రీ ఆఫీస‌ర్‌గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో మిల‌ట‌రీ క‌ట్ తో స‌రికొత్త లుక్ లోకి మారిపోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.