Begin typing your search above and press return to search.

విజ‌య్ - సామ్ మ‌ళ్లీ ఆ సినిమాని గుర్తు చేస్తారా?

By:  Tupaki Desk   |   21 March 2022 12:44 PM GMT
విజ‌య్ - సామ్ మ‌ళ్లీ ఆ సినిమాని గుర్తు చేస్తారా?
X
టాలీవుడ్ క్రేజీ హీరో రౌడీ స్టార్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాపై క‌న్నేశాడు. ఆయ‌న పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో చేస్తున్న చిత్రం `లైగ‌ర్‌`. బాక్సింగ్ నేప‌థ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈమూవీ చిత్రీక‌ర‌ణ ఆల్ మోస్ట్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ మూవీతో విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కాబోతున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ మూవీకి చార్మి, పూరి జ‌గ‌న్నాథ‌ల‌తో క‌లిసి క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తా కూడా ప్రొడ్యూస‌ర్స్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

బాలీవుడ్ సుంద‌రి అన‌న్య పాండే హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా హాలీవుడ్ క్రేజీ న‌టుడు, బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌క అతిథి పాత్రని పోషిస్తున్నారు. ముంబై స్ల‌మ్ ఏరియాకు చెందిన ఓ సాధార‌ణ ఛాయ్ వాలా జాతీయ స్థాయిలో బాక్సింగ్ ఛాంపియ‌న్ గా టైటిల్ ని సొంతం చేసుకున్నాడు? .. ఈ ప్ర‌యాణంలో అత‌ను ఎదుర్కొన్న స‌వాళ్ల నేప‌థ్యంలో ఆత్యంతం ఆస‌క్తిక‌రంగా ఈ మూవీని ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

ఈ మూవీ కోసం లాంగ్ హెయిర్ ని పెంచిన విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా మిల‌ట్రీ క‌టింగ్ లోకి మారిపోయి చాలా స్టైలిష్ గా క‌నిపిస్తున్నాడు. ఈ లుక్ తాజా చిత్రం కోసం అని తెలుస్తోంది. శివ నిర్వాణ త్వ‌ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ రొమాంటిక్ ల‌వ్ స్టోరీని తెర‌పైకి తీసుకురాబోతున్నాడని ఇటీవ‌ల వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని గ‌తంలో ప్ర‌క‌టించినా ఇంత వ‌ర‌కు దీని గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.

అయితే తాజాగా `లైగ‌ర్‌` చిత్రీక‌ర‌ణ పూర్త‌యిపోవ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో శివ నిర్వాణ‌తో సినిమాని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా స‌మంత న‌టించ‌నుంద‌ని ప్ర‌చారం మొద‌లైంది. `మ‌హాన‌టి`లో ఈ ఇద్ద‌రు క‌లిసి న‌టించారు. వీరి మ‌ధ్య కెమిస్ట్రీ చాలా చ‌క్క‌గా కుదిరింది. ఆ కార‌ణంగానే విజ‌య్ తో చేయ‌బోతున్న చిత్రానికి స‌మంత‌ని హీరోయిన్ గా ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ఫైన‌ల్ చేసుకున్నార‌ట‌.

ఈ మూవీ దాదాపు 60 శాతం కశ్మీర్ నేప‌థ్యంలో సాగుతుంద‌ని తెలుస్తోంది. గ‌తంలో క‌శ్మీర్ నేప‌థ్యంలో మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన `రోజా` చిత్రాన్ని ఈ మూవీ గుర్తు చేస్తుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ముందు ఈ మూవీలో విజ‌య్ కి జోడీగా కియారా అద్వానీని అనుకున్నార‌ట‌. అయితే ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ మూవీతో కియారా బిజీగా వుండ‌టంతో ఆ స్థానంలో స‌మంత‌ని ఫైన‌ల్ చేసుకున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబందించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలిసింది.