Begin typing your search above and press return to search.

వీడియో : కళావతిని దించేసిన లయ

By:  Tupaki Desk   |   11 April 2022 4:47 AM GMT
వీడియో : కళావతిని దించేసిన లయ
X
స్వయంవరం సినిమా తో హీరోయిన్ గా మంచి పేరును గుర్తింపును దక్కించుకున్న తెలుగు అమ్మాయి లయ ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు హీరోయిన్స్ కు తెలుగు లో అప్పటి నుండే ఆఫర్లు తగ్గడం మొదలు అయ్యింది. లయ కూడా ఎంత గొప్ప ప్రదర్శణ ఇచ్చినా కూడా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. దాంతో ఇండస్ట్రీకి ఆమె దూరం అయ్యింది.

పైగా లయ స్కిన్ షో విషయమై ఎప్పడు కూడా ఆసక్తి చూపించలేదు. ఆ కారణంగా కూడా ఆమెను తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ దూరం పెట్టి ఉంటారు అనేది టాక్‌. పెళ్లి చేసుకుని యూఎస్ లో సెటిల్‌ అయిన లయ ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో తెగ హడావిడి చేస్తున్న విషయం తెల్సిందే. మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను అన్నట్లుగా ఈమె హింట్ ఇస్తుంది.

హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించి గొప్ప నటిగా అనుభవం ఉన్న లయ సోషల్‌ మీడియాలో చేస్తున్న ప్రతి యాక్ట్‌ కూడా ఆకట్టుకుంటూ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మరియు ఆమె ఫాలోవర్స్ ను మెప్పించే విధంగా ఆమె డాన్స్ వీడియో లు ఇతర వీడియో లు ఉంటున్నాయి అంటూ సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు ఆమె అభిమానులు ఇతర నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.

తాజాగా లయ ట్రెండ్డింగ్‌ సాంగ్ అయిన సర్కారు వారి పాట కళావతికి డాన్స్ చేసింది. కళావతి హుక్ స్టెప్‌ ను వేసిన లయ కాస్త క్రియేటివిటీని జోడించింది. ఒకే వీడిను రెండు డ్రస్ ల్లో చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా సోలోగా చేయకుండా మరో ఇద్దరితో కలిసి ఈ వీడియో ను లయ చేసింది. లయ అందం ఏమాత్రం తగ్గలేదు అనేది ఆమె అభిమానుల టాక్‌.

పెళ్లి అయ్యి పిల్లలు అయిన తర్వాత కూడా ఆమె అందం దశాబ్ద కాలం క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని.. ఇప్పటికి కూడా ఈమెకు హీరోయిన్ గా ఆఫర్లు వచ్చే అవకాశాలు లేకపోలేదు అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు ఎప్పటిలాగే వైరల్‌ అవుతున్నాయి. తాజాగా కళావతి డాన్స్ వీడియో అంతకు మించి అన్నట్లుగా వైరల్‌ అవుతోంది. లయ కళావతి డాన్స్ ను దించేసింది. మీరు ఒక లుక్కేయండి.