Begin typing your search above and press return to search.

రిలీజ్ కి ముందు రాహుల్ సాంగ్ తో డ‌బుల్ కిక్!

By:  Tupaki Desk   |   16 March 2022 6:30 AM GMT
రిలీజ్ కి ముందు రాహుల్ సాంగ్ తో డ‌బుల్ కిక్!
X
యంగ్ హీరో రాజ్ త‌రుణ్ స‌క్సెస్ ల‌తో సంబంధం లేకుండా బిజీ న‌టుడిగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. 'కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త' త‌ర్వాత యంగ్ హీరో చాలా సినిమాల్లో న‌టించాడు. ఆవేవి ఆశించిన విజ‌యాల్ని అందించ‌లేదు. కోవిడ్ స‌మ‌యంలోనూ ఓటీటీలో రాజ్ త‌రుణ్ న‌టించిన మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటికి కొన్ని సినిమాలు మంచి కంటెంట్ తో తెర‌కెక్కిన థియేట‌ర్ రిలీజ్ కాక‌పోవ‌డం క‌లిసిరాలేదు. అయితే ఓటీటీ ఆడియ‌న్స్ కి యంగ్ హీరో ప‌రిచ‌య‌వ్వ‌డానికి ఉప‌యుక్తంగా మారిన చిత్రాలుగా చెప్పొచ్చు. ప్రస్తుతం యంగ్ హీరో వేగం ఏమాత్రం త‌గ్గ‌లేదు.

కొత్త సినిమాల‌తో బిజీగానే ఉన్నాడు. ప్ర‌స్తుతం 'స్టాండ‌ప్ రాహుల్' చిత్రంలో న‌టిస్తున్నాడు. యంగ్ మేక‌ర్ షాంటో ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్ -హైఫై పిక్చ‌ర‌స్ పై నంద‌కుమార్ అభినేని-భ‌ర‌త్ మ‌గులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇందులో రాజ్ త‌రుణ్ కి జోడీగా వ‌ర్ష బొల్లం న‌టిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న చిత్రం అన్ని ప‌నులు పూర్తిచేసుకుని మార్చి 18న రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి బిజ్ ని తీసుకొచ్చాయి. తాజాగా మ‌రో లిరిక‌ల్ సింగిల్ ని శ్రోత‌ల ముందుకు తీసుకొచ్చారు.

"షాలో...క‌ల‌ల వ్యాలీలో న‌డిచే మ‌న‌సురో..ప్లోలో లో ఫాంట‌సీలా మారేరో..హైయ్ లో హార్ట్ బీట్ ఏదో రిధ‌మేదో పెంచెరో లైవ్ లో లైఫ్ మ్యూజిక్ మార్చేరో" అంటూ సాగే మెలోడీ రొమాంటిక్ సాంగ్ ఆద్యంతం సంగీత ప్రియుల్ని ఆక‌ట్టుకుంటుంది. శేఖ‌ర్ ఆగ‌స్తీ సంగీతం లో ఫ్రెష్ ఫీల్ ని అందిస్తుంది. రొమాంటిక్ ల‌వ్ బుల్ పెయిర్స్ హార్ట్ ని ట‌చ్ చేసే సాంగ్ ఇది. సాంగ్ ట్రెండీగా ఉంది.

ఈ పాట‌ని శ్రీ ర‌చిచంగా..షాన్ ఆల‌పించారు. అందమైన లొకేష‌న్స్ న‌డుమ పాట చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. విజువ‌ల్ గా సాంగ్ హైలైట్ అయ్యేలా క‌నిపిస్తుంది. రాజ్ త‌రుణ్ లుక్ యువ‌త‌ని ఆక‌ట్టుకుంటుంది. వ‌ర్ష అందం..యెగ్ర‌సివ్ లుక్ ఆద్యంతం అల‌రిస్తుంది.

ఈ శుక్ర‌వారం సినిమా రిలీజ్ అవుతోన్న నేప‌థ్యంలో అంచనాలు బాగానే ఉన్నాయి. కోవిడ్ త‌ర్వాత రాజ్ త‌రుణ్ న‌టిస్తోన్న సినిమా థియేట‌ర్లో రిలీజ్ కావ‌డం ఇదే తొలిసారి. దీంతో రాజ్ త‌రుణ్ ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. ఇత‌ర హీరోల చిత్రాలేవి యంగ్ హీరోకి పోటీగా లేవు. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'రాధేశ్యామ్' నెగిటివ్ టాక్ నేప‌థ్యంలో మంచి థియేట‌ర్లు దొరికే అవ‌కాశం ఉంది. ఇక‌ యంగ్ హీరో న‌టించిన గ‌త మూడు చిత్రాలు 'ఉరేయ్ బుజ్జి'..'ప‌వ‌ర్ ప్లే'..'అనుభ‌వించు రాజా' నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.