Begin typing your search above and press return to search.

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై చెలరేగిపోతున్న 'సామాన్యుడు'

By:  Tupaki Desk   |   14 March 2022 8:30 AM GMT
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై చెలరేగిపోతున్న సామాన్యుడు
X
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై ఇప్పుడు భీకర యుద్ధమే జరుగుతోంది. వినోద ప్రపంచంలో తమదైన ప్రత్యేకతను చాటుకోవడానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పోటీపడుతున్నాయి. వీలైనంత విస్తృతంగా వినోదాన్ని అందించడంలో ముందుండటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ZEE 5 మరిన్ని ప్రయత్నాలకు .. ప్రయోగాలకు తెరతీస్తూ వెళుతోంది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ .. బెంగాలీ .. గుజరాతి భాషల్లో వినోదపరమైన విప్లవాన్ని తెస్తోంది. ఇందుకోసం అన్ని వైపుల నుంచి డిజిటల్ కంటెంట్ అను అందించడం కోసం కృషి చేస్తోంది.

రీసెంట్ గా ZEE 5లో 'సామాన్యుడు' సినిమాను స్ట్రీమింగ్ చేశారు. విశాల్ హీరోగా తు.ప. శరవణన్ తెరకెక్కించిన ఈ సినిమా, ఫిబ్రవరి 4వ తేదీన థియేటర్లకు వచ్చింది. తమిళంలో 'వీరమే వాగై సూదుమ్' అనే టైటిల్ తో విశాల్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. డింపుల్ హయతి కథానాయికగా నటించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చాడు. తమిళంలో ఈ సినిమా విశాల్ క్రేజ్ కి తగిన వసూళ్లనే రాబట్టింది. కానీ తెలుగు మాత్రం అప్పుడున్న పరిస్థితుల కారణంగా ఎవరూ అంతగా పట్టించుకోలేదు.

ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ నెల 4వ తేదీ నుంచి ZEE 5లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు .. తమిళ భాషలతో పాటు కన్నడలోను ఈ సినిమా అందుబాటులో ఉంది. వివిధ కారణాల వలన ఈ సినిమాను థియేటర్స్ లో చూడలేకపోయినవారు ఈ ఫ్లాట్ ఫామ్ పైకి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీక్షకుల నుంచి ఈ సినిమాకి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తుండటం విశేషం.

తెలుగులోను విశాల్ కి క్రేజ్ ఉండటం .. ఆయన సినిమాలకి మంచి మార్కెట్ ఉండటం వలన ZEE 5 వేదికపై ఈ సినిమా దూసుకుపోతోంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ తో ఈ సినిమా టీమ్ హ్యాపీగా ఉందని అంటున్నారు.

ఇక ZEE 5 ఫ్లాట్ ఫామ్ పై 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' .. 'లూజర్' .. 'లూజర్ 2' .. 'మళ్లీ మొదలైంది' అందుబాటులో ఉన్నాయి. నాగార్జున - చైతూ చేసిన 'బంగార్రాజు' కూడా రికార్డుస్థాయి రెస్పాన్స్ ను రాబడుతుండటం విశేషం. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ వేదికపై 'రౌడీ బాయ్స్' ప్రత్యక్షమైంది. శ్రీహర్ష కానుగంటి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లకు వచ్చింది.

ఆశిష్ రెడ్డి - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. థియేటర్ల నుంచి ఓ మాదిరి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి మరి!