Begin typing your search above and press return to search.

జంట క‌వుల‌తో ప్ర‌త్య‌క్ష‌మైన స‌మంత‌.. ఇంత‌కీ ఏం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   12 March 2022 4:28 AM GMT
జంట క‌వుల‌తో ప్ర‌త్య‌క్ష‌మైన స‌మంత‌.. ఇంత‌కీ ఏం జ‌రుగుతోంది?
X
జంట క‌వుల్లా జంట ద‌ర్శ‌కులు రాజ్ అండ్ డీకే స‌క్సెస్ ని ఆస్వాధిస్తున్నారు. ఓవైపు హిందీ చిత్ర సీమ‌లో ట్యాలెంటెడ్ ద‌ర్శ‌కులుగా వెలిగిపోతున్న ఈ తెలుగు కుర్రాళ్లు లోక‌ల్ ట్యాలెంట్ ని ప్రోత్స‌హించేందుకు ఎంత‌మాత్రం వెన‌కాడ‌డం లేదు. టాలీవుడ్ తో గొప్ప అనుబంధాన్ని కొనసాగిస్తున్న ఆ ఇద్ద‌రూ ఇంత‌కుముందు ప్రియ‌మ‌ణి- స‌మంత లాంటి టాలీవుడ్ స్టార్ల‌కు గొప్ప అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేశారు.

ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2లో స‌మంత‌ను రాజీ అనే తీవ్ర‌వాది పాత్ర‌కు ఎంపిక చేయ‌డం అది బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డం అంతా ఒక మిరాకిల్ అనుకుంటే ఇప్పుడు అదే జోడీ సమంత‌తో మ‌రో వెబ్ సిరీస్ కి స‌న్నాహ‌కాలు చేయ‌డం ఉత్కంఠ‌ను పెంచుతోంది.

ఈ శుక్రవారం సామ్ జంట క‌వుల‌తో ప్ర‌త్య‌క్ష‌మైంది. సమంత ముంబైలో ప‌ని మొద‌లు పెట్టింది. అక్క‌డ‌ క్రోమ్ స్టూడియో వెలుపల అటూ ఇటూ ట‌చ్చాడుతూ క‌నిపించింది సామ్. ఇటీవ‌లే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2022 లో స‌మంత సంద‌డిని మ‌ర్చిపోక ముందే ఇలా ఫ్యామిలీమ్యాన్ ద‌ర్శ‌క‌ద్వ‌యంతో క‌లిసి క‌నిపించింది. తాజాగా గ్రూప్ ఫోటో రాగానే.. రాజ్ అండ్ డీకేతో క‌లిసి త‌దుప‌రి వెబ్ సిరీస్ స‌న్నాహ‌కాల్లో సామ్ ఉంద‌ని అర్థ‌మైంది.

రాజ్ - DK ప్ర‌స్తుతం 'సిటాడెల్ స్పిన్-ఆఫ్‌' చిత్రీక‌ర‌ణ‌పై దృష్టి సారించారు. ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ క‌థానాయ‌కుడు. తాజాగా ప్రధాన తారాగ‌ణం.. దర్శకులు దాని కోసం కలుసుకున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రస్సో బ్ర‌ద‌ర్స్ తెర‌కెక్కిస్తున్న అంతర్జాతీయ గూఢచారి డ్రామా కి ఇది లోక‌లైజ్డ్ డ్రామాగా ఉండ‌నుంద‌ని స‌మాచారం.

మదర్ షిప్ సిరీస్ లో రిచర్డ్ మాడెన్ - ప్రియాంక చోప్రా జోనాస్ నటించిన సంగ‌తి తెలిసిందే. రాజ్ అండ్ డికె అందించిన సిరీస్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. అదే సమయంలో స్థానికీకరించిన ఎడిషన్ లు మెక్సికో- ఇటలీ- స్పెయిన్ లో అభివృద్ధి చేస్తున్నారు. సిటాడెల్ ఇండియన్ ఎడిషన్ స్వతంత్రంగా ప్లాన్ చేస్తున్నారు. కానీ మదర్ షిప్ సిరీస్ తో కనెక్ట్ అవుతుంద‌ని స‌మాచారం.

ఫ్యామిలీమ్యాన్ సిరీస్ తో రాజ్ అండ్ డీకేకి అంత‌ర్జాతీయ గుర్తింపు ద‌క్కింది. క‌శ్మీర్ లో పాక్ ఉగ్ర‌క‌లాపాల్ని అత్యంత భావోద్వేగ భ‌రితంగా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కులుగా ఈ జోడీ ప్ర‌త్యేక గౌర‌వాన్ని అందుకుంటోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇండియ‌న్ డ‌యాస్పోరా సినీప్రియులంతా రాజ్ అండ్ డీకేని గొప్ప‌గా అభిమానించి ప్రేమిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఈ జోడీతో స‌మంత అడుగులు త‌న‌కు ఇంట‌ర్నేష‌న‌ల్ అప్పీల్ ని తేనున్నాయి. మ‌రోవైపు సమంత ఓ అంత‌ర్జాతీయ స్థాయి సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.