Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ `స‌లార్‌`పై క్రేజీ రూమ‌ర్స్‌

By:  Tupaki Desk   |   25 Dec 2022 9:36 AM GMT
ప్ర‌భాస్ `స‌లార్‌`పై క్రేజీ రూమ‌ర్స్‌
X
ఈ మ‌ధ్య ప్ర‌తీ క్రేజీ సీక్వెల్ పై రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీకి సీక్వెల్ గా తెర‌కెక్కిన సినిమాలు చాలా వ‌ర‌కు ఈ మ‌ధ్య పార్ట్ 1 కి మించి సీక్వెల్స్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా నిలిచి బాక్సాఫీస్ వ‌ద్ద దేశ వ్యాప్తంగా ఊహ‌కంద‌ని స్థాయిలో విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. దీంతో వీటిల్లో కొన్నింటికి సీక్వెల్స్ చేయాల‌ని మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఈ నేప‌థ్యంలో ప‌లు క్రేజీ హిట్ ల‌కు, మేకింగ్ లో వున్న ప్రాజెక్ట్ ల‌కు కూడా సీక్వెల్స్ రానున్నాయంటూ ప్ర‌చారం మొద‌లైంది.

ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ `స‌లార్‌` కూడా వుంటుందూ ప్రాచ‌రం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారానికి ఆజ్యం పోస్తూ రీసెంట్ గా మేక‌ర్స్ సీక్వెల్స్ ని నిర్మించే ఆలోచ‌న‌లో వున్నామంటూ ప్ర‌క‌టించారు. అయితే ఈ ప్ర‌క‌ట‌న‌లో ఎక్క‌డా ఏ సినిమాకు సీక్వెల్ చేయ‌బోతున్నాం?.. ఎప్పుడు మొద‌లు పెడ‌తాం అనే విష‌యాల్ని హోంబ‌లే ఫిలింస్ మేక‌ర్ విజ‌య్ కిర‌గందూర్ వెల్ల‌డించలేదు.

కానీ నెట్టింట మాత్రం ప్ర‌భాస్ న‌టిస్తున్న `స‌లార్‌` విష‌యంలో క్రేజీ రూమ‌ర్ ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. గ‌త కొంత కాలంగా ఈ మూవీకి సీక్వెల్ ని ప్ర‌శాంత్ నీల్ చేస్తున్నాడ‌ని, ఒకేసారి రెండు భాగాల‌కు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతోంద‌ని, సైలెంట్ గా పార్ట్ 2 ని కూడా పూర్తి చేస్తున్నాడ‌ని, `బాహుబ‌లి`, కేజీఎఫ్ 2 త‌ర‌హాలో `స‌లార్` పార్ట్ 1, పార్ట్ 2 ల‌ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఆ ప్ర‌చారం కాస్తా తాజాగా మ‌రీ హ‌ద్దులు దాటేసింది. ఒక‌టికి మించి `స‌లార్‌` నుంచి సీక్వెల్స్ రానున్నాయ‌ని, `కేజీఎఫ్‌` మ‌ల్టీవ‌ర్స్ లో భాగంగా ఈ మూవీని ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ క‌న్ఫ్యూజ‌న్ కు గుర‌వుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం స‌లార్ సీక్వెల్స్ పై నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఈ మూవీపై జ‌రుగుతున్న ప్ర‌చారానికి తెర ప‌డాలంటే స‌లార్ రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.  

`స‌లార్‌`ని 2023 సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ చేయ‌బోతున్నారు. రిలీజ్ త‌రువాతే ఈ మూవీకి ఫ్రాంచైజీలు రానున్నాయా? .. లేదా?.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప్ర‌చారంలో వున్న నిజ‌మెంత‌? అనేది తేల‌నుంది. ఈ క‌న్ప్యూజ‌న్ కు తెర‌ప‌డాలంటే 2023 సెప్టెంబ‌ర్ 28 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.