Begin typing your search above and press return to search.

రామారావు లెక్క తప్పి రవితేజకి భారీగా ముట్టజెప్పాల్సి వచ్చిందా?

By:  Tupaki Desk   |   1 March 2022 6:20 AM GMT
రామారావు లెక్క తప్పి రవితేజకి భారీగా ముట్టజెప్పాల్సి వచ్చిందా?
X
మాస్ మహారాజా రవితేజ హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖిలాడి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఏమాత్రం ఆకట్టుకోని కథ కథనంతో సినిమా వచ్చిందంటూ రివ్యూలు వచ్చాయి. సినిమా ఫ్లాప్ కు పూర్తిగా దర్శకుడు రమేష్ వర్మ అంటూ టాక్ వచ్చింది. ఖిలాడి వల్ల రవితేజకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. బాక్సాపీస్ వద్ద ఖిలాడి సినిమా నిరాశ పర్చినా కూడా ఆయన ముందు ముందు సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి.

రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. భారీ అంచనాల నడుమ శరత్‌ మండవ దర్శకత్వంలో ఈ సినిమా రూపొంది. ఈ సినిమా ను చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని మొదటే ప్లాన్‌ చేశారు. కేవలం 30 వర్కింగ్‌ డేస్ ను మాత్రమే రవితేజ నుండి అడిగారట. అందుకు గాను 15 కోట్ల పారితోషికం కు కమిట్‌ అయ్యారు. ఖిలాడి సినిమా కు తీసుకున్న స్థాయి లోనే రామారావు సినిమాకు కూడా రవితేజ తీసుకున్నాడు.

కాని రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు కాస్త తక్కువ డేట్లతోనే సినిమా పూర్తి అవుతుంది భావించారు. కాని అనుకున్న డేట్ల కంటే మరో వారం రోజులు అదనంగా రవితేజ కేటాయించాల్సి వచ్చిందట. అందుకు గాను నిర్మాత దాదాపుగా రెండున్నర నుండి మూడు కోట్ల వరకు ముట్టజెప్పాడని తెలుస్తోంది. అంటే రవితేజ ఒక్కో కాల్షీట్ కు 40 నుండి 50 లక్షల రూపాయలు పలుకుతుందన్నమాట. రవితేజ వరుస ప్లాప్‌ ల బారిన పడ్డా కూడా ఆయన క్రేజ్‌ మాత్రం తగ్గలేదు.

క్రాక్ సినిమా తర్వాత మళ్లీ అతడి స్థాయి పెరిగింది.. మంచి సినిమాలు ఇస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాంతో రవితేజ తో సినిమాకు నిర్మాతలు భారీ పారితోషికంతో సిద్దం అవుతున్నారు. రవితేజ సినిమా సక్సెస్ అయినా ప్లాప్‌ అయినా కూడా థియేట్రికల్‌ బిజినెస్ మరియు నాన్ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా భారీ మొత్తం ఆదాయం వస్తుంది. దాంతో నిర్మాతలు విడుదలకు ముందుగానే సేఫ్ అవుతారు.

కనుక రవితేజ తో సినిమా లకు మేకర్స్ ఆసక్తిగా ఉన్నారనే టాక్‌ వినిపిస్తుంది. రామారావు ఆన్ డ్యూటీ సినిమా తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్‌ తో తీయాలని లెక్కలు వేసుకున్న మేకర్స్ లెక్క తప్పడంతో రవితేజ పారితోషికంతో పాటు మేకింగ్‌ ఖర్చు కూడా పెరిగిందట. దాదాపుగా అయిదు ఆరు కోట్లు అదనంగా ఖర్చు అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. అయినా కూడా రామారావు ఆన్ డ్యూటీ ఖచ్చితంగా ప్రతి పైసా ను వెనక్కు రాబట్టి లెక్కలు సరి చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. టైటిల్‌ చాలా క్యాచీగా ఉండటంతో పాటు సినిమా లో రవితేజ పాత్ర ఇతర విషయాలు సినిమా పై అంచనాలు కలిగేలా చేస్తున్నాయి.