Begin typing your search above and press return to search.
తెలుగు ఓటీటీ మార్చి సందడి మామూలుగా లేదుగా
By: Tupaki Desk | 9 March 2022 4:30 PM GMTతెలుగు ప్రేక్షకులకు డబుల్ ఎంటర్ టైన్మెంట్ ను సినిమాలు అందిస్తున్నాయి. ఒక వైపు థియేటర్ రిలీజ్ జోరు అందుకున్నాయి. ఇదే సమయంలో టీటీ సినిమాల హడావుడి కూడా ఓ రేంజ్ లో సాగుతోంది. పెద్ద ఎత్తున ఓటీటీ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. భారీ సినిమాలు చిన్న సినిమాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ అవ్వడంతో అభిమానులు మరియు ప్రేక్షకులు మస్త్ మజాను ఎంజాయ్ చేస్తున్నారు.
ఈనెల పెద్ద సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా రాబోతున్నాయి. ఇటీవలే భీమ్లా నాయక్ సినిమా విడుదల అవ్వగా మరో రెండు రోజుల్లో రాధేశ్యామ్ ఈనెల చివర్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా లు విడుదల కాబోతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ తో సందడి ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. థియేట్రికల్ సినిమాలు మాత్రమే కాకుండా బ్యాక్ టు బ్యాక్ ఓటీటీ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి.
గత నెల చివర్లో విడుదల అయిన భీమ్లా నాయక్ సినిమా ను ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం చేస్తున్నారు. నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ సిద్దంగా ఉంది. ఒకటి రెండు రోజుల్లో అందుకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరో వైపు సోనీ లైవ్ లో ఈ నెలంతా కూడా సౌత్ సినిమాలతో సందడి మామూలుగా ఉండదు అంటూ ఓటీటీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాను కూడా ఇదే నెలలో ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం చేస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. థియేటర్ రిలీజ్ అయ్యి నిరాశ పర్చినా కూడా ఖిలాడి కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీ లో రవితేజ సినిమాను చూడటం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
భీమ్లా నాయక్ మరియు ఖిలాడి సినిమాలతో పాటు ఈ నెలలో కొన్ని చిన్న సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు సిద్దం అవుతున్నాయి. కొన్ని డబ్బింగ్ సినిమాలను కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ వారంలో ప్రతి ఒక్క ప్రముఖ ఓటీటీ కూడా తెలుగు లో ఏదో ఒక సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ నెలంతా కూడా ప్రతి శుక్రవారం ఏదో ఒక భారీ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతూనే ఉంది. కనుక ఓటీటీ ప్రేక్షకులకు పండుగే.