Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ నుంచి తూఫాన్ వ‌చ్చేస్తోంది

By:  Tupaki Desk   |   18 March 2022 10:34 AM GMT
కేజీఎఫ్ నుంచి తూఫాన్ వ‌చ్చేస్తోంది
X
సైలెంట్ గా వ‌చ్చి 2018లో మోన్‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకుని దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించిన చిత్రం 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 1'. క‌న్న‌డ రాకింగ్ స్టార్ రాఖీ భాయ్ య‌ష్ హీరోగా న‌టించిన ఈ చిత్రం రాత్రికి రాత్రి అత‌న్ని పాన్ ఇండియా స్టార్ గా మార్చింది. వ‌న్ ఫిల్మ్ వండ‌ర్ అనిపించుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ని క్రేజీ డైరెక్ట‌ర్ ల జాబితాలో చేర్చింది. ముకింగ్ , టేకింగ్ ప‌రంగా 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించి. యాక్ష‌న్ మూవీని ఎక్క‌డా బోర్ అనిపించ‌కుండా డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లేతో ద‌ర్శ‌కుడు న‌డిపించిన తీరు సినిమాని దేశ వ్యాప్తంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌బెట్టింది.

ప్ర‌స్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా వ‌స్తున్న చిత్రం 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2'. తొలి పార్ట్ సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో పార్ట్ 2పై అంత‌కు మించి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుందా? అని అభిమానులు దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ మూవీ రిలీజ్ ని చిత్ర బృందం ఇటీవ‌ల హీరో య‌ష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌క‌టించింది. ఏప్రిల్ 14న ఐదు భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు.

రిలీజ్ డేట్ ని వెల్ల‌డిస్తూ కొత్త పోస్ట‌ర్ ని కూడా విడుద‌ల చేశారు. కానీ అప్ప‌టి నుంచి ఈ మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్ రావ‌డం లేద‌ని, ఈ స్థాయి భారీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కు టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతున్నా మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించ‌డం లేద‌ని ఫ్యాన్స్ చాలా రోజులుగా అసంతృప్తితో వున్నారు. ఇటీవ‌ల మేక‌ర్స్ ట్రైల‌ర్ ని మార్చి 27న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించినా అభిమానుల్లో ఎలాంటి స్పంద‌న లేదు.

'ఆర్ ఆర్ ఆర్‌' కార‌ణంగానే 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' ప్ర‌మోష‌న్స్ ని చేయ‌డం లేద‌ని, దీనికి రాజ‌మౌళి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని య‌ష్ ఫ్యాన్స్ ఇటీవ‌ల ఆరోప‌ణ‌లు కూడా చేశారు. అయితే అభిమానులు గోలని, వారి బాధ‌ని అర్థం చేసుకున్న మేక‌ర్స్ మొత్తానికి 'కేజీఎఫ్ 2' ప్ర‌మోష‌న్స్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఈ నెల 21 సోమ‌వారం నుంచి ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని జోరుగా ప్లాన్ చేశారు. ఈ నెల 21న ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ లిరిక‌ల్ వీడియోని 'తుఫాన్ .. పేరుతో సోమ‌వారం ఉద‌యం 11:07 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్టుగా ద‌ర్శ‌కుడు, చిత్ర నిర్మాణ సంస్థ శుక్ర‌వారం హోలీ సంద‌ర్భంగా ప్ర‌క‌టించింది.

ఇందుకు సంబంధించిన ఓ పోస్ట‌ర్ ని కూడా విడుద‌ల చేసింది. చిన్న పిల్ల‌ల‌పై ఈ పాట సాగ‌నున్న‌ట్టుగా తెలుస్తోంది. గ‌త కొన్ని రోజులుగా 'కేజీఎఫ్ 2' ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌డం లేద‌ని మేక‌ర్స్ పై అలిగి నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న అభిమానులు తాజా ప్ర‌క‌ట‌నతో ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నార‌ట‌.

ఏప్రిల్ 14న ఈ మూవీని భారీ స్థాయిలో క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. సంజ‌య్ ద‌త్ అధీరాగా, ర‌వీనా టాండ‌న్ ప్రైమ్ మినిస్ట‌ర్ ర‌మికాసేన్ గా న‌టించిన ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌. రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.