Begin typing your search above and press return to search.

మహానటి మరో కళాఖండం కు భయపడుతున్న ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   16 Feb 2022 4:30 AM GMT
మహానటి మరో కళాఖండం కు భయపడుతున్న ఫ్యాన్స్
X
మహానటి సినిమా తో పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ దక్కించుకున్న కీర్తి సురేష్ తన అందంతోనే కాకుండా అభినయంతో కూడా మెప్పించగలదని నిరూపించుకుంది. మహానటి సక్సెస్ దక్కించుకోవడంతో ఇబ్బడి ముబ్బడిగా వరుసగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తూ వచ్చింది. ఈ అమ్మడు చేసిన లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు బొక్క బోర్లా పడ్డాయి. కరోనా కారణంగా ఈమె నటించిన పెంగ్విన్ మరియు మిస్ ఇండియా సినిమాలు డైరెక్ట్ ఓటీటీ లో రిలీజ్ అయ్యాయి.

ఆ సినిమాలకు పెద్దగా పాజిటివ్‌ రెస్పాన్స్ రాలేదు. ఇటీవలే గుడ్‌ లక్ సఖి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాని ఆ సినిమా కూడా కీర్తి సురేష్ కు బ్యాడ్‌ లక్‌ నే మిగిల్చింది. ఇలా ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు నిరాశ పర్చుతున్న సమయంలో మళ్లీ ఆమె నుండి మరో లేడీ ఓరియంటెడ్‌ సినిమా వద్దని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో ఆమె నటించిన మరో లేడీ ఓరియంటెడ్‌ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం అంటూ ప్రకటన వచ్చింది.

తమిళ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కీర్తి సురేష్ మరియు ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ కీలక పాత్రల్లో నటించిన సాని కాయిధం థియేట్రికల్‌ రిలీజ్ ను స్కిప్‌ చేసి డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతుందట. చాలా రోజులుగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ను ఎట్టకేలకు విడుదల చేయబోతున్నారట. మేకర్స్ ఇప్పటికే అమెజాన్‌ కు ఈ సినిమా స్ట్రీమింగ్‌ రైట్స్ ను అమ్మేశారనే వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ ఉన్నప్పటికి ఈ సినిమా కు అమెజాన్ భారీ మొత్తం పెట్టకుండా మీడియం రేటుకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా లో సెల్వ రాఘవన్ కు సోదరి పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతుంది. 1980 కాలం కథతో ఈ సినిమా రూపొందింది. సెటిల్‌మెంట్‌ శాంభవి పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతుందట. ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్ మరియు స్టిల్స్ ను చూస్తుంటే సినిమాలో కీర్తి సురేష్ మరీ మాస్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా అనిపిస్తుంది. అంతే కాకుండా ఆమె రౌడీ రాని గా కనిపించబోతున్నట్లుగా అనిపిస్తుంది.

క్యూట్‌ కీర్తి సురేష్ ను హాట్‌ గా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్న ఈ సమయంలో ఇలా రౌడీ రంగమ్మ గా చూపిస్తే ఎవరు చూస్తారయ్యా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా కీర్తి సురేష్‌ గత లేగా ఓరియంటెడ్‌ చిత్రాల మాదిరిగానే వచ్చి పోతుందనే టాక్‌ అప్పుడే మొదలు అయ్యింది. ఈ సినిమా తర్వాత అయినా కీర్తి సురేష్ ఈ తరహా కళాఖండాలను చేయడం మానేయాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరో వైపు ఈ అమ్మడు సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబుకు జోడీగా నటిస్తుంది. ఇటీవల విడుదల అయిన కళావతి పాటలో కీర్తి సురేష్ అందం ను ఎంత చూసినా తనివి తీరడం లేదు అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆమె అందం మహేష్ బాబు పక్కన ఉంటే మరింతగా పెరిగినట్లుగా అనిపిస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా వచ్చిన ఫలితాల నేపథ్యంలో కీర్తి సురేష్ ఇప్పట్లో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు ఓకే చెప్పక పోవచ్చు.