Begin typing your search above and press return to search.

హనుమాన్‌.. ఇంత డిమాండ్‌ ఏంట్రా బాబు?

By:  Tupaki Desk   |   17 Feb 2022 11:30 AM GMT
హనుమాన్‌.. ఇంత డిమాండ్‌ ఏంట్రా బాబు?
X
బుల్లి ఇంద్రసేనా రెడ్డి తేజ సజ్జా హీరోగా మారి వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే అతడి నుండి వచ్చిన సినిమాలు కమర్షియల్‌ గా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు నటుడిగా మంచి పేరును తెచ్చి పెట్టాయి. సినిమా సినిమాకు తనను తాను కొత్తగా చూపించేందుకు తేజ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమా కు కమిట్‌ అయ్యాడు.

మొదటి ఇండియన్ సూపర్‌ మాన్ సినిమా అంటూ మేకర్స్ ప్రచారం చేస్తున్నారు. హనుమంతుడి కథ కాకుండా ఒక యువకుడికి సూపర్‌ పవర్స్ ఉంటే ఎలా ఉంటుంది అనే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ ద్వారా సమాచారం అందుతోంది. కథ మరియు కథనం చాలా విభిన్నంగా ఉంటాయని.. రెగ్యులర్‌ ఇండియన్‌ సినిమా తరహాలో కాకుండా విభిన్నంగా ఉంటుందని వారు నమ్మకంగా చెబుతున్నారు.

సినిమాపై ఇప్పటికే మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ప్రాజెక్ట్ ను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. దాంతో ఈ సినిమా నాన్ థియేట్రికల్‌ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోయాయి. ఈ సినిమా ఏకంగా 16 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్‌ బిజినెస్ ను చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాను జీ నెట్‌ వర్క్‌ ఈ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగిందట.

హిందీ డబ్బింగ్‌ ఓటీటీ రైట్స్ కు గాను 5 కోట్ల రూపాయలు జీ 5 సంస్థ పెట్టిందట. ఇక తెలుగు శాటిలైట్ మరియు డిజిటల్‌ రైట్స్ కు గాను 11 కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకున్నారట. ఈ సినిమా కేవలం తెలుగు మరియు హిందీలోనే కాకుండా తమిళం.. కన్నడం.. మలయాళంలో కూడా విడుదల కాబోతుంది. అక్కడ డబ్బింగ్‌ ఓటీటీ రైట్స్ కూడా భారీ మొత్తం పలికే అవకాశాలు ఉన్నాయి.

మొత్తంగా చూసుకుంటే నాన్ థియేట్రికల్‌ బిజినెస్ ద్వారా దాదాపు ఇరవై కోట్లకు పైగానే దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్థాయిలో బిజినెస్ చేయడం ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు తేజ ఏ సినిమా కూడా ఈ స్థాయిలో బిజినెస్ చేయలేదు. కేవలం తేజ సినిమా నే కాదు ఆయన స్థాయి హీరోల్లో ఏ హీరో సినిమా కూడా ఈ స్థాయి బిజినెస్ చేయలేదు అనడంలో సందేహం లేదు.

ఇక థియేట్రికల్‌ రైట్స్ ద్వారా మరింత భారీగానే లాభాలు నిర్మాతకు దక్కే అవకాశం ఉంది. సూపర్‌ పవర్స్ ఉన్న హీరో పాత్రలో తేజ కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలకు ఈ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ఇటీవల విడుల అయిన ఫస్ట్‌ లుక్ సినిమా పై మరింతగా అంచనాలు పెంచేస్తుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా బిజినెస్ ను చూసి ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.