Begin typing your search above and press return to search.

అతడిపై నమ్మకం లేక సొంతంగా మొదలెట్టిన దాసూ!?

By:  Tupaki Desk   |   17 March 2022 5:30 AM GMT
అతడిపై నమ్మకం లేక సొంతంగా మొదలెట్టిన దాసూ!?
X
ఫ‌ల‌క్‌నుమా దాస్ తో పాటు ఇంకా పలు సినిమాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న విశ్వక్ సేన్ తాజాగా దస్ కా దమ్‌కి అనే కొత్త సినిమా మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈయన నటించిన అశోకవనంలో లో అర్జున కళ్యాణం అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా విడుదల హడావుడిలో ఉండగానే కొత్త సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. దస్ కా దమ్‌కి సినిమాకు సంబంధించిన ప్రకటన గత ఏడాదిలోనే చేశారు.

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన పాగల్ చిత్ర దర్శకుడు నరేష్ దర్శకత్వంలోనే ఈ కొత్త సినిమా రూపొందబోతోంది అనే వార్తలు వచ్చాయి. ఈ ఏడాది సినిమా ఉందని చెబుతూ వచ్చారు. ఒక మంచి మాస్ ఎంటర్‌ టైనర్‌ గా ఈ సినిమా ఉంటుందని అంతా భావించారు. ఎట్టకేలకు సినిమా పట్టాలెక్కుతోంది కానీ దర్శకుడు మాత్రం మారాడు. ఈ సినిమా కు మొదట నరేష్‌ దర్శకత్వం వహిస్తాడని అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు విశ్వక్‌ సేన్‌.

ఈ సినిమా కథను స్వయంగా విశ్వక్‌ సేన్‌ రెడీ చేసుకున్నాడు కనుక అతనే దర్శకత్వం చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయానికి వచ్చారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సినిమా స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు నరేష్‌ పని తీరు విశ్వక్ సేన్ ని సంతృప్తి పరచలేక పోయాడని.. అందుకే ఆయనను తప్పించి తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నాడు అనే వార్తలు కూడా జోరుగా సాగుతున్నాయి.

అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. విశ్వక్సేన్‌ ఇంతకు ముందే ఫ‌ల‌క్‌నుమా దాస్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగా ఇప్పటికే నిరూపించుకున్నాడు కనుక ఈ సినిమాకు తానే సొంతంగా దర్శకత్వం చేయడం మంచి నిర్ణయమే అంటూ కొందరు ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకత్వం చేయడం అనేది విశ్వక్సేన్ కి కొత్త కాదు.. కనుక ఖచ్చితంగా ఈయన నుండి ముందు ముందు కూడా మరిన్ని మంచి సినిమాలు వస్తాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు వ్యక్తం చేస్తున్నారు.

ఫ‌ల‌క్‌నుమా దాస్ తో దర్శకుడిగా నిరూపించుకున్న విశ్వక్‌ సేన్‌ ఈ సినిమా తో సక్సెస్‌ అయితే ఖచ్చితంగా ఆయన మల్టీ ట్యాలెంటెడ్‌ అంటూ మరింతగా గుర్తింపు రావడం ఖాయం.