Begin typing your search above and press return to search.

దీపిక మిడిల్ ఫింగ‌ర్ దెబ్బ‌కి మండిపోతున్న జ‌నం

By:  Tupaki Desk   |   22 March 2022 5:31 AM GMT
దీపిక మిడిల్ ఫింగ‌ర్ దెబ్బ‌కి మండిపోతున్న జ‌నం
X
షారుక్ ఖాన్-జాన్ ఆబ్ర‌హం-దీపికా ప‌దుకొణే ప్ర‌ధాన పాత్ర‌ల్లో సిద్దార్ధ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో 'ప‌ఠాన్' చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజులుగా స్పెయిన్ లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. దాదాపు షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకుంది. అయితే స్పెయిన్ లో షూటింగ్ ప్రారంభమైన ద‌గ్గ‌ర నుంచి స్పాట్ నుంచి ఫోటోలు ఒక్కోక్క‌టిగా లీక్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ముందుగా షారుక్ ఖాన్ ఫోటోలు లీకై నెట్టింట వైర‌ల్ గా మారాయి. అటుపై దీపికా ప‌దుకొణే హాట్ ఫోటోలు లీక్ అయ్యాయి.

స్విమ్ షూట్ లో ఉన్న ఫోటోలు..టూపీస్ బికినీ లో ఉన్న హాట్ ఫోటోలు లీకై నెట్టింట పెద్ద దుమారామే రేపాయి. ఆ లీకులు చూసి ఎవ‌రైనా ప‌నిగ‌ట్టుకుని యూనిట్ స‌భ్యులే ఇలా చేస్తున్నారా? అన్నంత‌గా సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి. అయితే స్పెయిన్లో బ‌హిర్గ‌త ప్ర‌దేశంలోనే షూటింగ్ చేయ‌డం స‌హా పెద్ద‌గా సెక్యురిటీ కూడా లేక‌పోవ‌డంతో ఎవ‌రో ఒక‌రు ఇలా సెట్ నుంచి తీసిన ఫోటోలు వైర‌ల్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగింది. తాజాగా మ‌రోసారి దీపిక‌-షారుక్ ఖాన్ ప‌క్క‌ప‌క్కనే ఉన్న ఫోటోలు నెట్టింట మ‌రోసారి వైర‌ల్ గా మారాయి.

ఇవి రెండు సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు లా క‌నిపించ‌లేదు. దీపిక మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తూ లీకు వీరుల‌పై ఫైరింగ్ యాంగిల్ ని చూపిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఆ స‌మ‌యంలో దీపిక చాలా విసుగ్గానూ క‌నిపిస్తుంది. ఆ వెనుక‌నే షారుక్ మ‌ద్యం..సిగ‌రెట్టు తాగుతూ క‌నిపిస్తున్నారు. దీపిక‌-ఫారుక్ ఇలా బాల్క‌నీలో క‌నిపించ‌డంతో ఆ ఫోటోల్ని అభిమానులు బ‌య‌ట నుంచి క్యాప‌ర్చ్ చేసారు.

అదే స‌మ‌యంలో దీపిక వాళ్ల‌కి మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తూ అస‌హ్యించుకుంటున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారడంతో దీపిక కోప‌గించుకోవ‌డం చూసి నెటి జ‌నులు భ‌గ్గుమ‌న్నారు. దీపిక‌పై సెటైర్లు గ‌ప్పించ‌డం మొద‌లు పెట్టారు. దీపిక ఎందుక‌లా ప‌ల్టీలు కొడుతుంది? అని ఓ అభిమాని అడిగాడు. దానికి బ‌ధులుగా మరొక‌రు ఏం జ‌రుగుతోంది? ఫోటోలు తీయ‌కూడ‌ద‌ని చెబుతున్నా తీస్తున్నారు.

ఆ బికినీ ఫోటోలు వ‌ల్లే దీపిక‌కి అంత‌గా కోపం వ‌స్తుంద‌నుకుంటా? ఆ ఫోటోలు అస‌హ్యింగా క‌నిపించాయి. కాబ‌ట్టి అవి ఉద్దేశ పూర్వ‌కంగా లీక్ అయ్యాయ‌ని నేను అనుకోను అని అన్నారు. ఆమె వేలు ఎందుకు చూపుతుంది? ఆ పాడు ప‌నికి సంకేతంగానేనా? అని మండిప‌డ్డారు. సినిమా సెట్ నుంచి లీకులు స‌హ‌జం. అంత మాత్రాన దీపిక ఈ రేంజ్ లో వేలు చూపించి రెచ్చిపోవాలా? అంటూ మండిప‌డుతున్నారు.

మ‌రోవైపు షారుక్ క్లాసిక్ లుక్ పై ప్ర‌శంల వ‌ర్షం కురిపించారు అభిమానులు. షారుక్ క్లాసిక్ బ్రాండ్ అంటూ కొనియాడారు. ఇక దీపికా ప‌దుకొణే 'ప్రాజెక్ట్ -కె' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న ఇందులో న‌టిస్తుంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.