Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరీ: ర్యాప్ అరౌంట్ స్క‌ర్ట్ లో దీపిక మంట‌లు

By:  Tupaki Desk   |   18 March 2022 11:43 AM GMT
ఫోటోస్టోరీ: ర్యాప్ అరౌంట్ స్క‌ర్ట్ లో దీపిక మంట‌లు
X
బాలీవుబ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే బోల్డ్ అటెంప్ట్ గురించి చెప్పేదేముందు. ఆన్ దిస్ర్కీన్ అయినా..ఆఫ్ ది స్ర్కీన్ అయినా దీపిక ఎలివేష‌న్స్ ఓ రేంజ్ లో ఎలివేట్ అవుతుంటాయి. డిజైన‌ర్ దుస్తుల్లోన దీపిక మంట‌లు త‌ప్ప‌న‌స‌రిగా మారిపోతుంటాయి. తాజాగా పెళ్లైన బ్యూటీ మ‌రోసారి బికినీలో కాక‌లు పుట్టిస్తోన్న హాట్ ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. బ్లాక్ ప్రింటెడ్ బికినీ టాప్ లో..ర్యాప్-అరౌంట్ స్క‌ర్ట్ తో కుర్రాళ్ల హృద‌యాల్ని తొలిచేస్తుంది.

స్విమ్మింగ్ ముగించుకుని బ‌య‌ట‌కు వ‌స్తోన్న స‌మ‌యంలో ఇలా టోన్డ్ బాడీ లుక్ లో కెమారాకి చిక్కింది. నియాన్ ప‌సుపు హాల్ట‌ర్ నెక్ బికినీ ధ‌రించి బోల్డ్ అటెంప్ట్ తో స‌ల‌ప‌రం పుట్టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. దీపిక అభిమానులు ఆస్వాద‌న రేంజ్ గురించి మాట‌ల్లో చెప్ప‌లేం. త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు. ఇంత‌కీ ఈ ఫోటో స్పాట్ ఎక్క‌డ అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

ప్ర‌స్తుతం షారుక్ ఖాన్..జాన్ అబ్ర‌హం ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న 'ప‌ఠాన్' షూటింగ్ స్పెయిన్ లో జ‌రుగుతోంది. ఇటీవ‌లే దీపిక ప‌దుకొణే కూడా చివ‌రి షెడ్యూల్ షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లింది. ఆమె కోసం అక్క‌డ స‌క‌ల సౌర్యాలాతో కూడిన ఇంటిని సిద్దం చేసారు.

అక్క‌డే స్విమ్మింగ్ పూల్ ఇత‌ర‌ అన్ని రకాల వ‌స‌తులు ఉన్నాయి. అదే స్విమ్మింగ్ పూల్ లో బ్యూటీ ఇలా జ‌లాకాలాడిన అనంత‌రం కెమెరాకి చిక్కిన‌ట్లు తెలుస్తోంది. ఇదే స్పాట్ నుంచి షారుక్ కి చెందిన కొన్ని ఫోటోలు కూడా ఇటీవ‌ల నెట్టింట లీకై వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే.

ఇక దీపికా ప‌దుకొణే 'ప్రాజెక్ట్ -కె' చిత్రంతో టాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌భాస స‌ర‌స‌న న‌టిస్తోంది. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోన్న ఈ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రానికి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దీపిక‌తో పాటు అమితాబ‌చ్చ‌న్ కూడా ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో దీపిక న‌టించ‌డానికి భారీగా పారితోషికం ఇచ్చారు. పాన్ ఇండియా కేట‌గిరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

స‌క్సెస్ అయితే దీపిక ప‌దుకొణే సౌత్ లో బాగా ఫేమ‌స్ అవుతుంది. ఇక బాలీవుడ్ లో హృతిక్ రోష‌న్ స‌ర‌స‌న 'ఫైట‌ర్' లో న‌టిస్తోంది. సిద్దార్ధ్ ఆనంద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇలా బిగ్ స్టార్స్ చిత్రాల్లో న‌టిస్తూ దీపికా ప‌దుకొణే బిజీగా ఉంది.