Begin typing your search above and press return to search.

విల‌న్ కు చ‌ర‌ణ్‌ ఛాన్స్ ఇస్తున్నారా?

By:  Tupaki Desk   |   17 March 2022 9:30 AM GMT
విల‌న్ కు చ‌ర‌ణ్‌ ఛాన్స్ ఇస్తున్నారా?
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 'ఆర్ ఆర్ ఆర్‌'తో పాన్ ఇండియా స్టార్ గా మారుతున్న విష‌యం తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తొలి మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఇది. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన ఈ మూవీ ప్ర‌స్తుతం దేశ వ్యాప‌క్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. గ‌త కొంత కాలంగా వివిధ కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఎట్ట‌కేల‌కు మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. రిలీజ్ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్రమోష‌న్స్ ని మొద‌లు పెట్టేశారు.

చ‌ర‌ణ్ కూడా తార‌క్‌, డైరెక్ట‌ర్ రాజమౌళితో క‌లిసి ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్నారు. జోరుగా ఇంట‌ర్వ్యూలు ఇచ్చేస్తూ సినిమాపై మ‌రింత హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ కి డేట్.. టైమ్ ఫైన‌ల్ అయిపోవ‌డంతో హీరో రామ్ చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్ట‌డం మొద‌లుపెట్టాడు. ఈ మూవీ త‌రువాత వెంట‌నే చ‌ర‌ణ్ ది గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో ఓ భార ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లో ప్రారంభించి అక్క‌డ చ‌ర‌ణ్ కు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ని పూర్తి చేశారు.

ప్ర‌స్తుతం షూటింగ్ కి గ్యాప్ ఇవ్వ‌డంతో భార్య ఉపాస‌న‌తో క‌లిసి వోకేష‌న్ కి వెళ్లి వ‌చ్చిన చ‌ర‌ణ్ 'ఆర్ ఆర్ ఆర్‌' రిలీజ్ సంద‌ర్భంగా వ‌రుస ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే శంక‌ర్ మూవీ తాజా షెడ్యూల్ ని ప్రారంభించ‌డానికి రెడీ అవుతున్న చ‌ర‌ణ్ దీనితో పాటు 'జెర్సీ' ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి తో మ‌రో మూవీ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఓ డిఫ‌రెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌పైకి రానున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ తో క‌లిసి ఎన్ వి ఆర్ సినిమా సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌బోతున్నాయి.

ఈ చిత్రాన్ని జూన్ లో లాంఛ‌నంగా ప్రారంభించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చ‌క చ‌కా జ‌రిగిపోతున్నాయ‌ట‌. ఇదిలా వుంటే విల‌న్ కి రామ్ చ‌ర‌ణ్ అవ‌కాశం ఇవ్వ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ విల‌న్ మ‌రెవ‌రో కాదు స‌ముద్ర‌ఖ‌ని. ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించిన స‌ముద్ర‌ఖ‌ని ఆ త‌రువాత న‌టుడిగా, క్యారెక్ట‌ర్ ఆర్టీస్ట్ గా, విల‌న్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో అత్య‌ధిక చిత్రాల్లో ప‌వర్ ఫుల్ విల‌న్ గా న‌టించి పాపుల‌ర్ అయ్యారు. ఇటీవ‌ల ర‌వితేజ న‌టించిన 'క్రాక్‌' చిత్రంలో స‌ముద్ర‌ఖ‌ని క‌ఠారి కృష్ణ‌గా ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే.

అలాంటి స‌ముద్ర‌ఖ‌నితో చ‌ర‌ణ్ ఓ భారీ చిత్రాన్ని చేయ‌బోతున్నారంటూ తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఇదిలా వుంటు స‌ముద్ర‌ఖ‌ని ఓ ప‌క్క విల‌న్ గా న‌టిస్తూనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆయ‌న న‌టించి తెర‌కెక్కించిన త‌మిళ చిత్రం 'వినోదాయ సితం'.

ఈ చిత్రాన్ని తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్ తో రీమేక్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రాబోతోంది.