Begin typing your search above and press return to search.

శ్రీవ‌ల్లిని దించేసిన బీసీసీ ప్రెసిడెంట్ గంగూలీ!

By:  Tupaki Desk   |   24 March 2022 7:34 AM GMT
శ్రీవ‌ల్లిని దించేసిన బీసీసీ ప్రెసిడెంట్ గంగూలీ!
X
ఐకాన్ స్టార్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప` ది రైజింగ్ లో శ్రీవ‌ల్లి పాట లో హుక్ స్టెప్ వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎంత ఫేమ‌స్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. బ‌న్నీ హుక్ స్టెప్ ని అనుక‌రించిన క్రికెటర్ లేడు...సెల‌బ్రిటీలు లేరు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కూ..ఇండియా నుంచి ఆస్ర్టేలియా వ‌ర‌కూ ప్ర‌పంచ‌మే స్టెప్ కి ఫిదా అయింది.

టీమిండియా క్రికెటర్లు రవీంద్ర జడేజా.. శిఖర్‌ ధావన్‌.. సురేశ్‌ రైనా.. హార్దిక్‌ పాండ్యా..ర‌వి చంద్ర‌న్ అశ్విన్ తదితరులు త‌మ‌దైన శైలిలో అల‌రించారు.

ఇక ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ అయితే ఏకంగా రోజుకో వీడియోతో అల‌రించారు. `పుష్ప‌`లో శ్రీవల్లీ ఫీవ‌ర్ సోష‌ల్ మీడియాలో ఆ రేంజ్లో కొన‌సాగింది. సినిమా విడుద‌లై మూడు నెల‌లు గ‌డుస్తున్నా ఇంకా సోష‌ల్ మీడియాలో జోరు తగ్గ‌డం లేదున‌ రీసెంట్ గా బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ కూడా శ్రీవ‌ల్లి పాట‌కు స్టెప్పుల్ని దించేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా శ్రీవ‌ల్లి ఫీవ‌ర్ బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీని తాకింది. గంగూలీ కూడా శ్రీవ‌ల్లి హిందీ వెర్ష‌న్ పాట‌కి సిగ్నెచ‌ర్ స్టెప్ తో ఆక‌ట్టుకున్నారు. జీ బంగ్లా ఛాన‌ల్ లో ప్ర‌సారమ‌య్యే రియాల్టీ షోలో పాల్గొన్న గంగూలీ శ్రీవ‌ల్లి పాట‌కు ఇద్ద‌రు బాల‌ల‌తో క‌లిసి స్టెప్పులేసి అల‌రించారు. `త‌గ్గేదేలే` అంటూ మ్యాన‌రిజ‌మ్ తోనూ ఆక‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది.

గంగూలీ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ `పుష్ప` చిత్రం క్రేజ్‌ను మరోసారి వైరల్ చేస్తున్నారు. ఓ తెలుగు పాట‌కు ప్ర‌పంచ‌ స్థాయిలో ఆద‌ర‌ణ ద‌క్క‌డం ఇదే తొలిసారి. ఖండాలు దాటి శ్రీవ‌ల్లి సాంగ్ అభిమానుల్ని అల‌రించింది. ముఖ్యంగా క్రికెట్ క్రీడాకారులైతే పాట‌కి ఫిదా అయిపోతున్నారు. మైదానంలోనే స్టెప్పులేసి ఆక‌ట్టుకుంటున్నారు. బ్యాటింగ్ యాంగిల్స్..బౌలింగ్ యాంగిల్స్ ని సైతం పాట‌లో త‌మ‌దైన శైలిలో రీక్రియేట్ చేస్తున్నారు.

మ‌రి ఇలాంటి అద్భుత‌మైన సాంగ్ ని `పుష్ప ది రూల్` లో సుకుమార్-దేవి శ్రీలు ప్లాన్ చేస్తారేమో చూడాలి. ప్ర‌స్తుతం రెండ‌వ భాగం షూటింగ్ ప‌నుల్లో టీమ్ నిమ‌గ్న‌మైంది. అన్ని ప‌నులు పూర్తిచేసి వీలైనంత త్వ‌ర‌గా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది.