Begin typing your search above and press return to search.

ఔట్‌.. ఇంకా జడేజా పుష్పని మర్చి పోలేదు

By:  Tupaki Desk   |   25 Feb 2022 6:08 AM GMT
ఔట్‌.. ఇంకా జడేజా పుష్పని మర్చి పోలేదు
X
అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల పుష్ప సినిమా వచ్చి వారాలు నెలలు గడిచి పోతున్నా కూడా ఇంకా జనాలు ఆ ట్రాన్స్ నుండి బయట పడటం లేదు. ఆ మద్య మరీ ఎక్కడ చూసినా ఎవరిని చూసినా కూడా పుష్ప తగ్గేదేలే.. ఊ అంటావా ఊఊ అంటావా.. శ్రీవల్లి అంటూ మాటలు వినిపించేవి. ఏ టాపిక్ అయినా జనాల్లో రెండు మూడు వారాలు ఉంటుంది. కాని పుష్ప మాత్రం అంతకు మించి అన్నట్లుగా సందడి చేస్తుంది.

వసూళ్ల విషయంలో అంతకు మించి అంటూ భారీగా రాబట్టిన విషయం తెల్సిందే. దాదాపుగా 350 కోట్ల వసూళ్లను దక్కించుకున్న పుష్ప కేవలం హిందీ వర్షన్ తో వంద కోట్ల వసూళ్లు దక్కించుకోవడం అరుదైన రికార్డ్‌. 20 నుండి పాతిక కోట్ల వరకు పుష్ప దక్కించుకుంటే చాలా గొప్ప విషయం అని అంతా అనుకున్నారు. కాని వంద కోట్లకు పైగా పుష్ప హిందీ వర్షన్‌ దక్కించుకోవడం ఏ స్థాయి విజయమో అర్థం చేసుకోవచ్చు.

పుష్ప అంతటి విజయాన్నిసొంతం చేసుకోవడానికి కారణం స్టార్‌ క్రికెటర్స్ పుష్ప తగ్గేదే లే హిందీ డైలాగ్‌ ను చెప్పడం అలాగే శ్రీవల్లి పాటకు స్టెప్‌ వేయడం జరిగింది. ఆ రెండు కారణాల వల్ల సినిమా భారీగా వసూల్లు దక్కించుకుంది. తగ్గేదే లే అంటూ ఎంతో మంది ఎన్నో సందర్బాల్లో వాడారు.. ఇంకా వాడుతూనే ఉన్నారు. తాజాగా రవీంద్ర జడేజ కూడా తగ్గేదే లే అంటూ బన్నీ డైలాగ్‌ ను వాడేశాడు.

తాజా టీ20 మ్యాచ్ లో రవీంద్ర జడేజా ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మన్‌ ను ఔట్‌ చేసిన సమయంలో తనదైన బాడీ లాంగ్వేజ్ ను ప్రదర్శించకుండా కొత్తగా పుష్ప తగ్గేదే లే మ్యానరిజంను చూపించాడు. గడ్డం కింద అలా చేయి పెట్టి ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మన్ ను కవ్విస్తున్నట్లుగా రవీంద్ర జడేనా యాక్షన్ ఉంది. ఆ వీడియో మరియు ఫోటో ఎప్పటిలాగే వైరల్‌ అవుతూనే ఉంది.

సినిమా విడుదల అయ్యి ఇన్నాళ్లు అయ్యింది.. అయినా కూడా ఇంకా రవీంద్ర జడేజా వంటి స్టార్ క్రికెటర్స్ కి కూడా ఇంకా ఆ డైలాగ్‌ యాక్షన్ గుర్తు ఉంది అంటే ఎంతగా జనాల్లో అది నిలిచి పోయిందో అర్థం చేసుకోవచ్చు.

తగ్గేదే లే డైలాగ్‌ ను పుష్ప పార్ట్‌ 2 లో కూడా ఖచ్చితంగా ప్రముఖంగా పెట్టే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఇంకాస్త మసాలా యాడ్‌ చేసి సుకుమార్ ప్లాన్‌ చేస్తే బాగుంటుందని కూడా నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.