Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ ని స‌ర్‌ప్రైజ్ చేసిన‌ భీమ్లా.. గాడ్ ఫాద‌ర్

By:  Tupaki Desk   |   24 Feb 2022 5:54 AM GMT
ఫ్యాన్స్ ని స‌ర్‌ప్రైజ్ చేసిన‌ భీమ్లా.. గాడ్ ఫాద‌ర్
X
మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య వున్ బాండింగ్ గురించి అంద‌రికి తెలిసిందే. ఈ ఇద్ద‌రు క‌లిసి `భీమ్లా నాయ‌క్‌` రిలీజ్ సంద‌ర్భంగా ఫ్యాన్స్ ని స‌ర్ ప్రైజ్ చేశారు. ఈ ఇద్ద‌రి స‌ర్ ప్రైజింగ్ వీడియోని గురువారం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానుల‌తో పంచుకున్నారు.

ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట సంద‌డి చేస్తోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన ప‌వ‌ర్ ఫుల్ హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `భీమ్లా నాయ‌క్‌`. య‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైలాగ్స్‌, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రాన్నిఅయ్యారే, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు ఫేమ్ సాగ‌ర్ కె. చంద్ర తెర‌కెక్కించారు. రానా ద‌గ్గుబాటి కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ప‌వ‌న్ న‌టించిన ఈ మూవీ హిందీలోనూ విడుద‌ల కాబోతున్న విష‌యం తెలిసిందే. పెన్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తోంది. ఉత్త‌రాదిలో భారీ ఎత్తున ఈ మూవీ రిలీజ్ ని పెన్ స్టూడియోస్ ప్లాన్ చేసింది.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్, ప్రీ రిలీజ్ సంద‌ర్భంగా విడుద‌లైన రిలీజ్ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ట్రైల‌ర్ పై కొంత అసంతృప్తిని వ్య‌క్తం చేసిన ఫ్యాన్స్ రీసెంట్ గా ప్రీ రిలీజ్ వేడుక‌లో విడుద‌ల చేసిన రిలీజ్ ట్రైల‌ర్ అభిమానుల్లో పూన‌కాల‌ని తెప్పిస్తోంది. ప‌వ‌న్ పాత్ర‌ని మాత్ర‌మే హైలైట్ చేస్తూ రిలీజ్ చేసిన ట్రైల‌ర్ ఫ్యాన్స్ ని శివాలెత్తిస్తోంది. సినిమాలో ప‌వ‌న్ విశ్వ‌రూపం చూపించ‌బోతున్నార‌ని, వ‌న్ మ్యాన్ షోగా మూవీ వుండ‌బోతోంద‌ని స్ప‌ష్టం చేసింది.

పూర్తిగా ఫ్యాన్స్ కి ఈ విష‌యంలో క్లారిటీ రావ‌డంతో అంబ‌రాన్ని తాకే విధంగా సంబ‌రాలు మొద‌లుపెట్టారు. ఈ నేప‌థ్యంలో రామ్ చ‌ర‌ణ్ విడుద‌ల చేసిన వీడియో మెగా అభిమానుల‌కు స్పెష‌ల్‌ ట్రీట్ గా మారింది. `భీమ్లా రిలీజ్ సంద‌ర్భంగా `భీమ్లా నాయ‌క్‌` టీమ్ కు ఆల్ ద బెస్ట్ చెబుతూ ఈ వీడియోని రిలీజ్ చేశారు. ఇటీవ‌ల చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో `భీమ్లా నాయ‌క్` సెట్ లో మెగాస్టార్ చిరంజీవి హ‌ల్ చ‌ల్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం మోహ‌న్ రాజా డైరెక్ష‌న్ లో రూపొందుతున్న `గాడ్ ఫాద‌ర్` చిత్రంలో న‌టిస్తున్నారు.

మెగాస్టార్ `భీమ్లా నాయ‌క్‌` సెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ త‌రువాత మెగాస్టార్ `గాడ్ ఫాద‌ర్‌` సెట్ లో సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా త‌మ్ముడు ప‌వ‌న్ ప‌క్క‌న కూర్చుని ఆప్యాయంగా భుజంపై చేయి వేసి చిరున‌వ్వులు చిందిస్తున్న వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ సంద‌ర్భంగా చిరు ఏదో అంటుంటే త్రివిక్ర‌మ్ నేల‌పై కూర్చోని చిరుకు దండం పెట్ట‌డం ఆక‌ట్టుకుంటోంది. పోలీస్ డ్రెస్ లో ప‌వ‌న్‌, ఖైదీ డ్రెస్ లో చిరంజీవి ఈ వీడియోలో క‌నిపించారు. ఒకే వీడియోలో అన్నాద‌మ్ములు క‌లిసి సంద‌డి చేయ‌డంతో మెగా ఫ్యాన్స్ స‌ర్‌ప్రైజ్ గా ఫీలివుతున్నారు.

Watch Here : https://twitter.com/AlwaysRamCharan/status/1496704417495539716?s=20&t=ZFcxxDzlfSDSqCnYe1iV4Q