Begin typing your search above and press return to search.

జల్సా అంటున్న హీరోయిన్‌

By:  Tupaki Desk   |   28 Feb 2022 1:30 PM GMT
జల్సా అంటున్న హీరోయిన్‌
X
జల్సా అనే పదం తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన పదం.. సరదాగా సమయం గడుపుతున్న సమయంలో జల్సా చేస్తున్నావని అంటూ ఉంటారు.. అంతే కాకుండా పవన్‌ కళ్యాణ్ జల్సా అనే సినిమాను చేయడం వల్ల కూడా ఈ పదం మరింత పాపులర్ అయ్యింది. అలాంటి జల్సా ను ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. మోస్ట్‌ క్రేజీ అండ్ బ్యూటీఫుల్‌ విద్యా బాలన్ చేయడం తో తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

హీరోయిన్ గా విద్యా బాలన్‌ సుదీర్ఘమైన కెరీర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఆమె ఈమద్య కాలంలో వరుసగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తూ వస్తున్నారు.

హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు ఈమద్య కాలంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో జల్సా సినిమా పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ను సురేష్ త్రివేణి తెరకెక్కించారని తెలుస్తోంది.

ఈ సినిమా ను థియేటర్‌ రిలీజ్ కాకుండా డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్‌ లో ఈ సినిమా ను ఈనెల 18 న స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇటీవలే బాలీవుడ్‌ నుండి దీపిక పదుకునే గ్రెహయాన్‌ సినిమా అమెజాన్ లో వచ్చింది. ఇప్పుడు అదే అమెజాన్ లో విద్యా బాలన్ జల్సా సినిమా స్ట్రీమింగ్‌ కు రెడీ అయ్యింది.

సోషల్‌ మీడియాలో ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సురేష్ త్రివేణి దర్శకత్వంలో ఈ సినిమా ను టీ సిరీస్ బ్యానర్‌ లో భూషన్ కుమార్‌ మరియు కృష్ణ కుమార్‌ లు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా లో విద్యా బాలన్ తో పాటు కీలక పాత్రలో శేఫాలి షా నటించారు. వీరిద్దరి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్ సినిమా పై జనాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. జల్సా అంటూ రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు జల్సా ఫీల్‌ ను కలిగిస్తుందేమో చూడాలి.