Begin typing your search above and press return to search.

స్వీటీ అనుష్క చేసిన త‌ప్పు త‌మ‌న్నా కూడా..!

By:  Tupaki Desk   |   11 April 2022 4:12 AM GMT
స్వీటీ అనుష్క చేసిన త‌ప్పు త‌మ‌న్నా కూడా..!
X
`సైజ్ జీరో` మూవీ కోసం అనుష్క చేసిన ప్ర‌యోగం ఎలాంటి ప‌రిణామానికి దారి తీసిందో తెలిసిందే. కొన్నేళ్ల పాటు అధిక బ‌రువు స‌మ‌స్య‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత దానిని త‌గ్గించుకునేందుకు చాలా స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. కానీ ఇప్పుడు అలాంటి స‌మ‌స్య‌నే మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా కూడా ఫేస్ చేస్తోందా? అంటూ అభిమానుల్లో గుస‌గుస మొద‌లైంది.

ఇటీవ‌ల స‌న్న‌జాజి సోయ‌గంలా ఇత‌ర నాయిక‌లంతా మెరిసిపోతుంటే త‌మ‌న్నా మాత్రం అనూహ్యంగా బ‌రువు పెరిగిపోతోంది. త‌న న‌డుము చుట్టూ ఫ్యాట్ ఇత‌ర శ‌రీర‌భాగాల్లో అధిక ఫ్యాట్ నిల్వ‌లు స్ప‌ష్ఠంగా క‌నిపిస్తున్నాయ‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే మిల్కీ వైట్ బ్యూటీ కాస్త తొంద‌ర‌గానే ప‌రిస్థితి అదుపు త‌ప్ప‌క ముందే జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో తమన్నా తన జిమ్ సెషన్ నుండి వర్కౌట్ వీడియోను పోస్ట్ చేసింది. త‌న హాటెస్ట్ బాడీని తిరిగి షేప‌ప్ చేసేందుకు క‌ఠోరంగా శ్ర‌మిస్తోంది ఈ వీడియోలో. కాస్త క‌ఠిన‌మైన సెష‌న్ లో పాల్గొంది త‌మ‌న్నా. బరువు త‌గ్గించేందుకు శిక్షణను తీసుకుంటోంది. కోచ్ అవ‌స‌రం మేర త‌న‌కు మార్గ‌నిర్ధేశ‌నం చేస్తూ ఈ వీడియోలో క‌నిపించారు. ముఖ్యంగా న‌డుము భాగంలో కొవ్వు క‌రిగించే టిప్స్ ని త‌న‌కు చెబుతున్నార‌ని వీడియో వెల్ల‌డిస్తోంది. ఈ వీడియోలో జిమ్ లో వర్కౌట్ చేయడానికి గ్రే కోర్ ఆర్డ్ అథ్లెషర్ ధరించి కనిపించింది.

మిల్కీ ఈ వీడియో క్లిప్ కి అదిరే క్యాప్షన్ ఇచ్చింది. ``మీ దగ్గర ఉన్న‌ది దాచొద్దు`` అనేది క్యాప్ష‌న్. దీనిపై కొంతమంది నెటిజనులు ర‌క‌ర‌కాల కామెంట్లు చేశారు. అధిక బ‌రువు పెరగడం వల్లనే ఇలాంటి క్యాప్షన్ ఇచ్చింద‌ని.. దానిని దాచుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని వ్యాఖ్యానించారు. త‌మ‌న్నా నిరంత‌రం తన టోన్డ్ ఫిజిక్ ని మెయింటెయిన్ చేసినా ఇటీవ‌ల అదుపు త‌ప్పింద‌ని అర్థ‌మ‌వుతోంది. తమన్నా కొంత బరువు పెరిగినట్లు కనిపిస్తోంది కానీ అదుపు చేయ‌క‌పోతే ప్ర‌మాద‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే కొంద‌రు అభిమానులు మాత్రం ఈ రూపాన్ని ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మునుపటి కంటే హాట్ గా కనిపిస్తోందని ప‌లువురు వ్యాఖ్యానించారు.

త‌మ‌న్నా కెరీర్ ప‌రంగా తిరుగులేని పొజిష‌న్ ఓ ఉంది. కంబ్యాక్ ని అద‌ర‌గొట్టేస్తోంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న `భోళా శంకర్` లో న‌టిస్తోంది. సైరా త‌ర్వాత‌ చిరంజీవి స‌ర‌స‌న‌ ఇది రెండ‌వ అవ‌కాశం. గ‌తంలో `సైరా న‌ర‌సింహారెడ్డి`లోనూ చిరంజీకి జోడీగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అందులో ఆ కాంబినేష‌న్ కి మంచి పేరొచ్చింది. ఈ నేప‌థ్యంలోనే మ‌రోసారి `భోళా శంక‌ర్` లో చాన్స్ అందుకుంది. అలాగే `ఎఫ్ -2`కి సీక్వెల్ గా తెర‌కెక్కుతోన్న ఎఫ్ -3 లోనూ మ‌రోసారి విక్ట‌రీ వెంక‌టేష్ తో రొమాన్స్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. ఇక బాలీవుడ్ లో `బోలే చుడియాన్`.. `ప్లాన్ ఏ ప్లాన్ బీ` చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని `బౌన్సర్ టౌన్` అని పిలుచుకునే అసోలా ఫతేపూర్ లో మధుర్ భండార్కర్ తో `బాబ్లీ బౌన్సర్` సెట్ లో షూటింగ్ లో పాల్గొంటోంద‌ని స‌మాచారం.