Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోయిన్‌ భర్తకు ఇలాంటి దుస్ధితి వచ్చింది పాపం

By:  Tupaki Desk   |   25 Feb 2022 4:30 PM GMT
స్టార్‌ హీరోయిన్‌ భర్తకు ఇలాంటి దుస్ధితి వచ్చింది పాపం
X
కొన్ని నెలల ముందు వరకు ఉన్న పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అప్పుడు తన భార్యతో కలిసి మీడియా కు ఫోజులు ఇస్తూ సరదాగా మీడియా వారిని ప్రశ్నించిన ఆ వ్యక్తి ఇప్పుడు మీడియా కనిపించిన వెంటనే హడావుడిగా నడుచుకుంటూ కారులో ఎక్కి కూర్చున్నాడు. కనీసం మీడియాకు ముఖం కూడా చూపించేందుకు ఆసక్తి చూపించలేదు. ఆయన మీడియా వారు పిలిచినా పట్టించుకోకుండా వెళ్లి పోయాడు.

ఈ సంఘటన ముంబయిలో బాంద్రాలో జరిగింది. మొహం దాచుకున్న ఆ స్టార్‌ హీరోయిన్‌ భర్త పేరు రాజ్ కుంద్రా. ఆ స్టార్‌ హీరోయిన్ పేరు శిల్పా శెట్టి. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడం కోసం శిల్పా శెట్టి కుటుంబం మొత్తంతో కలిసి బయటకు వచ్చారు. ఆ సమయంలో మీడియా వారిని కవర్ చేసేందుకు ప్రయత్నించింది. ఎప్పటిలాగే శిల్పా శెట్టి మీడియా కెమెరా మెన్స్ కు ఫోజులు ఇచ్చారు.

తన కొడుకుతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన శిల్ప శెట్టి నవ్వుతూ అందరికి హాయ్ చెప్పింది. ఆ వెంటనే అక్కడకు వచ్చిన రాజ్ కుంద్రా హడావుడిగా కారు ఎక్కేశాడు. రాజ్ కారు ఎక్కిన కొద్ది సమయంకు శిల్ప కూడా కారు లోకి ఎక్కేసింది. ఆమెను ఫోటోలకు ఫోజు ఇవ్వమంటూ మీడియా వారు పిలవడంతో ఆమె మళ్లీ కూడా కెమెరాలకు ఫోజు ఇవ్వడం జరిగింది. కాని రాజ్ కుంద్రా కనీసం మొహం చూపించలేదు.

ఆయన ఫేస్ షీల్డ్‌ పెట్టుకుని ఉన్నారు. అక్కడ నుండి స్పీడ్‌ గా వెళ్లి పోయాడు. మీడియా వారు ఆయన్ను కవర్‌ చేసేందుకు గట్టిగా పిలిచినా కూడా పలుకలేదు. దాంతో మీడియా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అశ్లీల వీడియోల షూటింగ్‌ చేస్తున్నాడంటూ ఆయన పై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.

కొన్నాళ్లు జైల్లో కూడా జీవితం గడిపిన రాజ్ కుంద్రా ఇటీవలే బెయిల్‌ పై బయటకు వచ్చాడు. ఇంకా రాజ్ కుంద్రా దోషి అంటూ నిర్థారణ అవ్వలేదు. కనుక ఆయన విషయమై కొందరు మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం తో ఆయన కాస్త సీరియస్ గా ఉన్నాడు.

మీడియా పై అసహనం కారణంగానే కెమెరాకు ఫోజు ఇవ్వలేదని టాక్ వినిపిస్తుంది. కొందరు మాత్రం అప్పుడు తప్పు చేసి ఇప్పుడు తల దించుకుని పారిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.