Begin typing your search above and press return to search.

సర్కారు వారి పాట శివరాత్రి స్పెషల్‌ అదుర్స్‌

By:  Tupaki Desk   |   1 March 2022 6:24 AM GMT
సర్కారు వారి పాట శివరాత్రి స్పెషల్‌ అదుర్స్‌
X
సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ లో కీలక సన్నివేశాల చిత్రీకరన జరుపుతున్న విషయం తెల్సిందే.

ఇటీవలే ఈ సినిమా నుండి థమన్‌ స్వరపర్చిన కళావతి పాట విడుదల అయ్యి సినిమా పై అంచనాలు మరింతగా పెంచడం జరిగింది. ఈ సినిమా నుండి మరో పాటను విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించారు.

నేడు మహా శివ రాత్రి సందర్బంగా సినిమా నుండి కొత్త పోస్టర్‌ ను విడుదల చేశారు. మహేష్ బాబు యాక్షన్‌ సన్నివేశంలోని స్టిల్‌ ను అభిమానుల కోసం యూనిట్‌ సభ్యులు రిలీజ్ చేశారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. తాజా ఈ పోస్టర్ ను చూస్తుంటే పోకిరిలో మహేష్ ను చూసినట్లుగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్ బాబు కు ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్‌ సక్సెస్ ను ఈ సినిమా ఇవ్వడం ఖాయం అనిపిస్తుంది. మహేష్‌ బాబు 2020 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ ఏడాది సమ్మర్ లోనే మహేష్ తదుపరి సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. కాని కరోనా వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. మొన్న సంక్రాంతికి ఈసినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా పెద్ద సినిమాల కోసం సైడ్ ఇచ్చారు.

ఇప్పుడు ఈ సినిమా ను ఎవరు అడ్డు వచ్చినా ఆపేది లేదు అన్నట్లుగా మే 12వ తారీకున విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. థమన్‌ పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ తో ఈ సినిమా స్థాయి మరింత పెరుగుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పలు సినిమాలు మ్యూజికల్‌ హిట్స్ గా నిలిచాయి. కనుక ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు.

థమన్‌ సంగీత సారథ్యంలో వచ్చిన భీమ్లా నాయక్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ గురించి తెగ చర్చించుకుంటున్నారు. కనుక సర్కారు వారి పాటకు కూడా అదే స్థాయిలో థమన్‌ నేపథ్య సంగీతం ను అందిస్తాడని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ పోస్టర్‌ అభిమానులకు ఆనందం ను కలిగిస్తుంది.