Begin typing your search above and press return to search.

స‌మంత మెస్మ‌రైజ్ చేయ‌లేక‌పోయిందా?

By:  Tupaki Desk   |   22 Feb 2022 11:30 AM GMT
స‌మంత మెస్మ‌రైజ్ చేయ‌లేక‌పోయిందా?
X
శకుంత‌ల - ద‌శ్యంతుడి ఎపిక్ ల‌వ్ స్టోరీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌పైకి తీసుకొస్తున్నారు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌. ఆయన తెర‌కెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ `శాకుంత‌లం`. చ‌రిత్ర‌లో నిలిచిపోయిన రొమాంటిక్ టేల్ శకుంత‌ల - దుశ్యంతుడి ప్రేమ‌క‌థ‌. ఈ క‌థ‌ని నేటి త‌రానికి అందించాల‌నే సంక‌ల్పంతో భారీ సెట్టింగులు.. అత్యంత భారీ బ‌డ్జెట్ తో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న చిత్ర‌మిది. దిల్ రాజు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చారిత్ర‌క చిత్రంలో స‌మంత టైటిల్ పాత్ర‌ని పోషిస్తోంది.

మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం గ్రాఫిక్స్ తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుపుకుంటోంది. గ‌త కొంత కాలంగా వార్త‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా నిలుస్తున్న ఈ చిత్రం నుంచి శాకుంత‌ల ఫ‌స్ట్ లుక్ ని మేక‌ర్స్ సోమ‌వారం ఉద‌యం విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో స‌మంత ఏంజిల్ గా వైట్ క‌ల‌ర్ కాస్ట్యూమ్స్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ప‌చ్చ‌ని అడవిలో ఓ బండ రాయిపై హోయ‌లు పోతూ క‌నిపించి స‌ర్ ప్రైజ్ చేసింది.

చుట్టూ నెమ‌ళ్లు.. పావురాళ్లు.. లేడీ జింక‌లు, కుందేళ్ల మ‌ధ్య దేవ‌క‌న్య‌లా క‌నిపించింది స‌మంత. అయితే ఈ ఫ‌స్ట్ లుక్ మేక‌ర్స్ ఊహించిన స్థాయిలో మాత్రం నెట్టింట వైర‌ల్ కాలేక‌పోయింది. త‌న టార్గెట్ ని రీచ్ కాలేక‌పోయింది. కార‌ణం `శాకుంత‌లం` ఫ‌స్ట్ లుక్ విడుద‌లైన స‌మ‌యంలోనే ఏపీ ఐటీ, ప‌రిశ్ర‌మ శాఖ మంత్ర మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి హ‌ఠాత్తుగా గుండెపోటుతో మ‌ర‌ణించ‌డం.. ఆయ‌న ఆకాల మ‌ర‌ణం కార‌ణంగా `భీమ్లా నాయ‌క్ ` ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేక‌ర్స్ వాయిదా వేస్తున్నామంటూ ప్ర‌క‌టించ‌డం...

సోమ‌వారం రాత్రి 9 గంట‌ల‌కు ఫైన‌ల్ గా `భీమ్లా నాయ‌క్` ట్రైల‌ర్ ని రిలీజ్ చేయ‌డం వంటి కార‌ణాల‌తో స‌మంత `శాకుంత‌లం` ఫ‌స్ట్ లుక్ అనుకున్న స్థాయిలో రీచ్ కాలేక‌పోయింది. ప్రేక్ష‌కుల అటెన్ష‌న్ ని గ్రాబ్ చేయ‌లేక‌పోయింది.

దీంతో `శాకుంత‌లం` టీమ్ బ్యాడ్ ల‌క్ రాంగ్ టైమ్ లో ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇదే మిగ‌తా టైమ్ లో అయితే ఫ‌స్ట్ లుక్ ఓ రేంజ్ లో ప్రేక్ష‌కుల‌కు రీచ్ అయ్యేద‌ని, అనూహ్య సంఘ‌ట‌న కార‌ణంగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ టాపిక్ లో లేకుండా పోయింద‌ని చెబుతున్నారు.

అయితే ఈ సంద‌ర్భంగా ఓ చ‌ర్చ జ‌రుగుతోంది. `పుష్ప‌` కోసం స‌మంత `ఊ అంటావా మావ ఊహూ అంటావా` అనే ఐట‌మ్ సాంగ్ లో న‌టించిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ప్రేక్ష‌కుల్ని ఓ రేంజ్ లో ఎట్రాక్ట్ చేసింది. నెట్టింట వైర‌ల్ గా మారింది. అయితే అందుకు భిన్నంగా `శాకుతంలం` ఫ‌స్ట్ లుక్ ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోవ‌డంతో ఫెయిల్ అయింద‌ని, మ‌రోసారి అయినా ఆడియ‌న్స్ అటెన్ష‌న్ ని గ్రాబ్ చేసే విధంగా మేక‌ర్స్ ప‌క్కాగా ప్లాన్ చేసుకుంటే మంచిద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.