Begin typing your search above and press return to search.

వేల కోట్ల ప‌టౌడీ సంస్థానం ఈ న‌లుగురు వార‌సుల‌దే

By:  Tupaki Desk   |   22 Feb 2022 4:30 AM GMT
వేల కోట్ల ప‌టౌడీ సంస్థానం ఈ న‌లుగురు వార‌సుల‌దే
X
రాజులు రాజ్యాలు అంత‌రించినా వారు ఇచ్చిన ఆస్తుల్ని అనుభ‌వించే రాకుమారులు ఇంకా ఉన్నారు. అలాంటి ఒక రాకుమారుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంటుంది. ఇక సైఫ్ అందాల క‌థానాయిక క‌రీనా క‌పూర్ ని పెళ్లాడి ఇద్ద‌రు వార‌సులకు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసింఏద‌.

సైఫ్ ఫ్యామిలీ సెల‌బ్రేష‌న్స్ వెబ్ లో నిరంత‌రం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి. కరీనా కపూర్ ఖాన్ - సైఫ్ అలీ ఖాన్ చిన్న కుమారుడు జెహ్ అలీ ఖాన్ ఈ రోజు తన మొదటి పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

తాజాగా సారా అలీ ఖాన్ ఆమె సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ తమ సవతి సోదరుడి విలాసవంతమైన పుట్టినరోజు వేడుక కోసం కరీనా ఇంటికి విచ్చేశారు. సైఫ్ మొదటి భార్య అమృతా సింగ్ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు.

సారా షేర్ చేసిన తాజా ఫోటోలలో స్పెష‌ల్ డే గుర్తుగా సైఫ్ అలీ ఖాన్ నలుగురు పిల్లలు ఒకే చోట ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం క‌న్నుల‌పండుగ‌ను త‌ల‌పించింది. ఈ చిరస్మరణీయ జ‌న‌రేష‌న్ చిత్రాన్ని చూసి పటౌడీస్ అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.

సైఫ్ తన పిల్లలు జెహ్- తైమూర్- సారా - ఇబ్రహీం ల‌తో పోజులిచ్చాడు. తైమూర్ పార్టీని ఆస్వాదిస్తున్నప్పుడు సారా ఏడుస్తున్న జెహ్ ను ఊర‌డిస్తోంది. ఫోటోలను షేర్ చేసిన‌ సారా హ్యాపీయెస్ట్ ఫస్ట్ బర్త్ డే బేబీ జె అని తెలిపారు.

వేల కోట్ల ఆస్తులు ఉన్న‌ ప‌టౌడీ సంస్థానం నుంచి వ‌చ్చినా ఎంతో డౌన్ టు ఎర్త్ నేచుర్ తో సారా ఎప్పుడూ ఆక‌ట్టుకుంటుంది. ఇక త‌న సోద‌రుడు ఇబ్ర‌హీం అంతే క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల‌వాడ‌ని సౌమ్యుడ‌ని స్నేహితులు చెబుతారు.