Begin typing your search above and press return to search.

'రాధేశ్యామ్‌' ల‌వ్ స్టోరీ మాత్ర‌మేనా.. అంత‌కు మించి

By:  Tupaki Desk   |   28 Feb 2022 4:30 PM GMT
రాధేశ్యామ్‌ ల‌వ్ స్టోరీ మాత్ర‌మేనా.. అంత‌కు మించి
X
ప్ర‌భాస్ సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేసి దాదాపు మూడేళ్ల‌కు పైనే అవుతోంది. త‌మ హీరో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్ర‌భాస్ అభిమానులు గ‌త మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు వారి ఎదురుచూపుల‌కు తెర‌ప‌డుతోంది. ప్ర‌భాస్ న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. గ‌త కొంత కాలంగా రిలీజ్ వాయిదాప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. `జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. యువీ క్రియేష‌న్స్ తో క‌లిసి బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్ నిర్మించింది.

బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గాన‌టించిన ఈ చిత్రంపై ఇప్ప‌టికే అంచ‌నాలు భారీగా వున్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సిపిమాని విభిన్న పంథాలో ప్ర‌మోట్ చేస్తోంది చిత్ర బృందం. సినిమాలో హీరో ప్ర‌భాస్ పాల‌మిస్ట్ గా క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. హెరిటేజ్ రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా 1970 నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. జ‌న‌వ‌రిలోనే సంక్రాంతికి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయాల్సిన ఈ మూవీ క‌రోనా, ఒమిక్రాన్ ల కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇప్ప‌టికి రిలీజ్ కుద‌ర‌డంతో మేక‌ర్స్ ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కి స్పీడ‌ప్ చేసేశారు.

ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ చిత్ర ట్రైల‌ర్ ఇప్ప‌టికే విడుద‌లైంది. మంచి బ‌జ్ ని క్రియేట్ చేసింది. అయితే రిలీజ్ వాయిదా ప‌డ‌టం.. ఫైన‌ల్ గా మార్చి 11న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ కొత్త ట్రైల‌ర్ ని క‌ట్ చేశార‌ట‌. ఈ మూవీ నుంచి ఎక్జైటింగ్ అప్ డేట్ రావ‌డం లేదంటూ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న వేళ మేక‌ర్స్ అభిమానుల‌కు ట్రైల‌ర్ రిలీజ్ చేస్తున్న‌ట్టుగా గుడ్ న్యూస్ చెప్పారు.

మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చి 2న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు `రాధేశ్యామ్‌` న్యూ ట్రైల‌ర్ ని విడుద‌ల చేస్తున్నారు. ల‌వ్ ని గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకోండి. రాధేశ్యామ్ ట్రైల‌ర్ ని మార్చి 2 మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్న‌ట్టుగా మేక‌ర్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఇదిలా వుంటే ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన టీజ‌ర్ , ట్రైల‌ర్ ల‌లో ల‌వ్ స్టోరీకి సంబంధించిన అంశాల‌తో పాటు ట్రైన్ షాట్స్ .. ఓడ మునిగిపోతున్న దృశ్యాల‌ని మాత్ర‌మే చూపించారు.

దీంతో ప్ర‌భాస్ మార్కు యాక్ష‌న్ ఘ‌ట్టాల‌కు ఈ చిత్రంలో చోటులేదా? అనే భావ‌న ప్రేక్ష‌కుల‌తో పాటు అభిమానుల్లోనూ క‌లిగింది. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన చిత్ర బృందం సినిమా రొమాంటిక్ ల‌వ్ స్టోరీ మాత్ర‌మే కాదు అంత‌కు మించి అంటూ సినిమాలోని యాక్ష‌న్ యాంగిల్ ని తాజా ట్రైల‌ర్ లో చూపించ‌బోతోంది. ఇందు కోసం ముంబైలో భారీ ఈవెంట్ ని ప్లాన్ చేశార‌ట‌. మార్చి 2న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముంబైలో ట్రైల‌ర్ ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసిన‌ట్టుగా తెలిసింది.

అంతే కాకుండా ఈ మూవీ మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. `రాధేశ్యామ్‌` మేక‌ర్స్ ముందు నుంచి ఈ సినిమా ఒక విజువ‌ల్ వండ‌ర్ అంటూ చెప్పుకొస్తున్నారు. అదే విష‌యాన్ని మేకింగ్ వీడియో స్ప‌ష్టం చేయ‌బోతోంద‌ని తెలిసింది. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు , బాలీవుడ్ న‌టి భాగ్య‌శ్రీ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ మూవీ బిగ్ స్కేల్ లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఉత్త‌రాదిలో భారీగా రిలీజ్ ని టి సిరీస్ ప్లాన్ చేసింది.