Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్‌ రిలీజ్ తర్వాత వెళ్లి ఇప్పుడు వచ్చిన ప్రభాస్‌..!

By:  Tupaki Desk   |   1 April 2022 6:00 AM IST
రాధేశ్యామ్‌ రిలీజ్ తర్వాత వెళ్లి ఇప్పుడు వచ్చిన ప్రభాస్‌..!
X
ప్రభాస్‌ తన తాజా చిత్రం 'రాధేశ్యామ్‌' విడుదల అయిన వెంటనే విదేశాలకు వెళ్లాడు అనే ప్రచారం జరిగింది. అది ఎందుకు అనేది రకరకాలుగా ప్రచారం జరిగింది. రాధేశ్యామ్‌ సినిమా నిరాశ పర్చడంతో విదేశాలకు వెళ్లాడు అంటూ కూడా కొందరు ప్రచారం చేశారు. అసలు విషయం ఏంటీ అనేది అధికారికంగా బయటకు రాలేదు. కాని తాజాగా హైదరాబాద్‌ కు ప్రభాస్ రావడంతో ఆసక్తికర వార్త ఒకటి వినిపిస్తుంది.

సోషల్‌ మీడియాలో రకరకాలుగా పుకార్లు చేస్తున్న ఈ సమయంలో ఆయన సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మోకాళు యొక్క ఆపరేషన్‌ కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్లాడు. యాక్షన్‌ సన్నివేశాల సమయంలో గత కొన్నాళ్లుగా మోకాళు నొప్పితో బాధ పడుతున్న ప్రభాస్ ఈ ఆపరేషన్ తో కాస్త ఉపశమనం పొందినట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్‌ తిరిగి వచ్చిన ప్రభాస్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలుస్తోంది. మరో వారం లేదా రెండు వారాల విశ్రాంతి తర్వాత మళ్లీ షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉంది. వెంటనే యాక్షన్ సన్నివేశాలకు వెళ్లకుండా కాస్త ఆలస్యంగా యాక్షన్‌ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మొదటగా ఈయన సలార్ షూటింగ్‌ లో జాయిన్‌ అవుతాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

మరో వైపు ఈయన రాక కోసం ప్రాజెక్ట్‌ కే చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు దర్శకుడు నాగ్‌ అశ్విన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ మొదలు అయ్యి కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న ప్రాజెక్ట్‌ కే కి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం సెట్టింగ్ ను నిర్మించారని తెలుస్తోంది. త్వరలోనే ప్రభాస్ ఈ రెండు సినిమాల షూటింగ్ ల్లో జాయిన్‌ అవుతాడని తెలుస్తోంది.

మరో వైపు మారుతి దర్శకత్వంలో ఒక సినిమాను ఈయన చేయబోతున్న విషయం తెల్సిందే. దానయ్య నిర్మించబోతున్న ఆ సినిమా కు రాజా డీలక్స్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఆ సినిమా అధికారిక ప్రకటన వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవే కాకుండా ఆదిపురుష్ సినిమా ను ఇప్పటికే ముగించిన ప్రభాస్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు