Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు ఉందా?

By:  Tupaki Desk   |   13 April 2022 2:30 AM GMT
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు ఉందా?
X
`ఆర్ ఆర్ ఆర్` హిట్ తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హ్యాపీగా ఉన్నారు. కొమ‌రం భీమ్ పాత్ర‌తో తార‌క్ 100 శాంత సంతృప్తి చెందారు. తార‌క్ ఎంట్రీ స‌న్నివేశాలు గానీ...పులితో ఛేజింగ్ సీన్స్ గానీ..జంతువుల‌తో పాటు బ్రిటీష్ వాళ్ల‌పై భీమ్ తెగ‌బ‌డిన స‌న్నివేశాలైతేనంగానీ అన్ని తార‌క్ ని న‌టుడిగా అలా పైకి లేపాయి. కానీ ఎక్క‌డో చిన్న అసంతృప్తి. అదే ఓ సెక్ష‌న్ ఎన్టీఆర్ అభిమానుల్ని తీవ్ర నిరాశ‌కు గురించేసింది. ముఖ్యంగా తార‌క్ డై హార్డ్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురైన మాట వాస్త‌వం.

ఎన్టీఆర్ ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నాడు? అని కూడా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఈ విష‌యం పై ఫ్యాన్స్- ఎన్టీఆర్ మాత్ర‌మే స్పందిచాల్సిన అంశం. అలా ఎన్టీఆర్ పై ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్ విష‌యంలో అంత‌కు మించిన గుసాయింపు చూపిస్తున్నారా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది.

తార‌క్ 30వ చిత్రం కొర‌టాల శివ ద‌ర్శ‌త‌క‌త్వంలో ఉంటుంద‌ని ప్ర‌క‌టించి ఏడాది పూర్త‌యింది. సినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ప్రారంభం కావాలి. కానీ ఇంత వ‌ర‌కూ ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అయింది. కానీ ఆ ద్వ‌యం ఇంకా సెట్స్ కు వెళ్ల‌లేదు. దీంతో తార‌క్ అభిమానులు ఒకింత అస‌హ‌నంతో ర‌గిలిపోతున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌న‌లాంటి క‌ష్టాలు ఇంకే హీరో అభిమానుల‌కు రాకూడ‌ద‌ని ఓ అభిమాని గుసాయించాడు. ఎన్టీఆర్..ఆ చిత్ర నిర్మాత చేసిన ట్వీట్ల‌ను మ‌రోసారి స్ర్కీన్ షాట్ తీసి షేర్ చేస్తున్నారు. అభిమానులుగా ఎంతో ఫీల‌వుతున్నాం అన్నా అంటూ అసంతృప్తితో న‌లిగిపోతున్నారు. మ‌రి వీట‌న్నింటిని తార‌క్ అభిమానుల గుండెల్లో నుంచి ఎప్పుడు తొల‌గిస్తారో.

అయితే వీలైనంత త్వ‌ర‌లోనే వాట‌న్నింక‌టి చెక్ పెట్టే అవ‌కాశం క‌నిపిస్తుంది. కొర‌టాల శివ తెర‌కెక్కించిన `ఆచార్య‌` ఈనెల 30న రిలీజ్ అవుతుంది. అనంతరం కొర‌టాల కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుని తార‌క్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించే అవ‌కాశం క‌నిపిస్తుంది. ఇటు `ఆర్ ఆర్ ఆర్` స‌క్సెస్ మూడ్ నుంచి తార‌క్ బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌నిలో ఉన్నాడు.