Begin typing your search above and press return to search.

వాలిపోతున్న కెరాటాల్నే 200 స్పీడ్ తో పైకి లేపుతోంది!

By:  Tupaki Desk   |   17 March 2022 12:30 AM GMT
వాలిపోతున్న కెరాటాల్నే 200 స్పీడ్ తో పైకి లేపుతోంది!
X
బాలీవుడ్ అందం మౌనీ రాయ్ హాటెస్ట్ ఎలివేష‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆందాల ఆరోబోత‌లో అమ్మ‌డు ముందు వ‌రుస‌లో ఉంటుంది. పూల్ సైడున టూపీస్.. స్విమ్ షూట్ బికీనీల్లో చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. తెర‌చిన పుస్త‌కం వ‌లే బ్యూటే అందాలు ఆర‌బోస్తుంది. ఇసుక తిన్నుల్లో అందాల ఆర‌బోతతో ఇసుక తుఫాల్నే ర‌ప్పిస్తుంది. సంద‌ర్భం ఏదైనా మౌని టెంప్టింగ్ ఫోజుల‌కు ఎవ‌రైనా ప్లాట్ అవ్వాల్సిందే. అంత‌గా గ్లామ‌ర్ ఎలివేష‌న్ పై దృష్టి పెడుతుంది.

తాజాగా బ్యూటీ స‌ముంద్రం కెర‌టాల్నే టెంప్ట్ చేసే స్టిల్ ఒక‌టి నెట్టింట దుమారం రేపుతోంది. ఆటు పోటుల‌కు అల‌సిసొలసిన కెర‌టాలకే కాక‌లు పుట్టిస్తోంది. స‌ముద్ర కెర‌టం క్షీణించే ద‌శ వ‌ద్ద నిల‌బ‌టి మౌనీ రాయ్ ఇలా కెమెరాకి ఫోజులిచ్చింది. బ్లాక్ అండ్ బ్లాక్ బీచ్ వేర్ లో వ‌య్యారంగా నుంచ‌ని వీపు అందాల్ని..థై అందాల్ని ఎలివేట్ చేస్తోంది. అల్లాంత దూర‌న ఉన్న ఎర్ర‌టి సూర్యుడి సైతం ప‌సుపు ప‌చ్చ‌గా మారిపోయాడు బ్యూటీ వ‌డ్డ‌నికి. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఫాలోవ‌ర్స్ హాట్ కామెంట్ల‌తో హీటెక్కిస్తున్నారు.

న‌టి మౌని రాయ్ మ‌ల్టీట్యాలెంటెడ్. మోడ‌లింగ్ నుంచి అటుపై గాయ‌నిగా..న‌టిగా ఫేమ‌స్ అయింది. సినిమా ల‌క‌న్నా ఎక్కువ‌గా టీవీషోల‌తోనే మౌనీరాయ్ బాగా ఫోక‌స్ అయింది. పాప్ ఆల్బ‌మ్ సింగర్ గాను మౌని మెరుపులు మెరిపించిం ది. అయితే న‌టిగా మాత్రం ఇంకా నిల‌దొక్కుకోలేదు. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టీకీ అవి యాక్టింగ్ అంత‌గా స్కోప్ లేని చిత్రాలుగానే ఉన్నాయి. `కేజీఎఫ్` చాప్ట‌ర్ -1లో స్పెష‌ల్ అప్పీరియ‌న్స్ తో సౌత్ లో కొంచెం పేరొచ్చింది.

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో `బ్ర‌హ్మ‌స్ర్త‌`లో న‌టిస్తుంది. ఇది మౌని కెరీర్ లో బిగెస్ట్ ఫిల్మ్. అమితాబ‌చ్చ‌న్..నాగార్జున ..ర‌ణ‌బీర్ క‌పూర్ ..అలియా భ‌ట్ .. డింపుల్ క‌పాడియాతో క‌లిసి మౌని తెర‌ను పంచుకుంటుంది. `బ్ర‌హ్మ‌స్ర్త` మౌనీ రాయ్ కెరీర్ ని ట‌ర్న్ చేసే చిత్రంగానే భావించొచ్చు. ప్రాజెక్ట్ పై అమ్మ‌డు సైతం భారీగానే ఆశ‌లు పెట్టుకుంది. 300 కోట్ల బ‌డ్జెట్ తో చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్-ద‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆయాన్ ముఖ‌ర్జీ ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్నారు.