Begin typing your search above and press return to search.

మ‌హేష్ మ‌రో స‌ర్ ప్రైజ్ కి రెడీ అంటున్నాడా?

By:  Tupaki Desk   |   25 March 2022 8:31 AM GMT
మ‌హేష్ మ‌రో స‌ర్ ప్రైజ్ కి రెడీ అంటున్నాడా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ మ‌రో స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నారా? అంటే టాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. అంతే కాకుండా ప్ర‌స్తుతం స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ మాసీవ్ మూవీస్ ల‌ని యాక్ష‌న్ ప్యాక్ట్ చిత్రాల‌ని చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌హేష్ కూడా త్వ‌ర‌లో అదే త‌ర‌హా మూవీతో రావాని ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. స్టార్ హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌` చిత్రంలో న‌టిస్తున్నారు.

ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈమూవీని యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 ప్ల‌స్ రీల్స్‌, జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్‌, సాంగ్స్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తున్నాయి. గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా, మ‌రింత స్టైలిష్ గా హీరో మ‌హేష్ క‌నిపిస్తున్నారు.

హై వోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈమూవీపై భారీ అంచ‌నాలే వున్నాయి. `పోకిరి` వైబ్స్ క‌నిపిస్తున్నాయ‌ని మ‌హేష్ స్వ‌యంగా చెప్న‌ప‌డంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం మ‌రింత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీని మే 12న విడుద‌ల చేస్తున్న‌ట్టుగా చిత్ర బృందం ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఈ మూవీ త‌రువాత మ‌హేష్ వెంట‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో రూపొంద‌నున్న పాన్ ఇండియా మూవీ చేయ‌బోతున్నారు. ఇటీవ‌లే లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ త‌రువాత రాజ‌మౌళితో ఓ భారీ మూవీకి మ‌హేష్ శ్రీ‌కారం చుట్ట‌నున్న విష‌యం తెలిసిందే. ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్ నేప‌థ్యంలో అడ్వెంచ‌ర‌స్ మూవీగా ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్‌. నారాయ‌ణ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా జ‌రుగుతోంద‌ని, స్క్రీప్ట్ వ‌ర్క్ పూర్త‌యింద‌ని ఇటీవ‌ల ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్న‌సాద్ వెల్ల‌డించారు. అయితే ఈ మూవీ త‌రువాత మ‌హేష్ ఓ మాసీవ్ ఎంట‌ర్ టైన‌ర్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఊర మాస్ హై వోల్టేజ్ యాక్ష‌న్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన ద‌ర్శ‌కుడు ఈ మూవీని డైరెక్ట్ చేసే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. నిజంగా ఈ కాంబినేష‌న్ సెట్ట‌యితే ఫ్యాన్స్ కి మ‌హేష్ నుంచి మ‌రో స‌ర్ ప్రైజ్ రానున్న‌ట్టే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.